ఆదా చేయండి.. సీదా వెళ్లండి


Fri,May 3, 2019 01:12 AM

ప్రయాణమంటే అందరికీ సరదానే. ఖర్చంటేనే భయం. ప్రయాణం చేసేవాళ్లంతా ధనవంతులు అవ్వాల్సిన అవసరం లేదు. ఆదాయం తక్కువ ఉన్న కూడా ఆదా చేసి సీదాగా ప్రయాణాలు చేయొచ్చు. ఈ చిట్కాలు ఫాలో అయితే ప్రయాణం మరింత సులువు అవుతుంది.
savemoney
-ప్రయాణం చేయడానికి డబ్బు ఎంతో అవసరం. కానీ డబ్బు కోసమే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉండొద్దు. అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. జీరో బడ్జెట్ టూర్లు వేసుకొని వెళ్లే ట్రెండ్ ఈ మధ్య చాలా ఎక్కువయింది. జీరో బడ్జెట్ కాకున్నా... తక్కువ బడ్జెట్‌లో ట్రిప్‌లు ఎలా వేయాలో చదివి తెలుసుకోండి.
-ముందు ప్రయాణం ఎక్కడికి నుంచి ఎక్కడికి చేస్తున్నారు. అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, ఉండాల్సిన రోజులు, ఎలాంటి ప్రయాణాలు అవసరం అవుతాయో తెలుసుకొని బడ్జెట్ ప్రణాళిక వేసుకోవాలి. రెండు నెలల ముందు దుబారా ఖర్చులు తగ్గించుకొని డబ్బులు దాచుకుంటే బాగుంటుంది.
-నిరుపయోగంగా ఉన్న వస్తువులను అమ్మేయండి. దీంతో డబ్బుని సంపాదించగలుగుతారు. ఇంట్లో ఉన్న పనికి రాని వస్తువులను అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి. ఇంట్లో స్థలం కూడా ఖాళీ అవుతుంది. బయట ఎవరూ కొనకపోతే ఆన్‌లైన్ అన్నీ అమ్మబడుతున్నాయి. ఏదైనా సైట్‌లో పెట్టేయండి. అవసరం ఉన్నవాళ్లు తీసుకుంటారు.
-చిన్న విషయాలను ఆవేశపడి అన్ని వస్తువులు కొనకండి. షాపింగ్ తగ్గించుకోండి. కొనుగోలు ఆపి ధనాన్ని ఆదా చేయడం మొదలుపెడితే నష్టం ఉండదు. నిజంగా అవసరం అయిన వస్తువులను తెలుసుకొని కొనండి.
-వినోదపు ఖర్చులకు పరిమితి పెడితే మంచిది. స్నేహితులతో బయటికెళ్లి అనవసరపు ఖర్చులు చేయకపోవడం ఉత్తమం. ఖర్చు లేకుండా ఉచిత ప్రవేశం ఉన్న ప్రదేశాలకు వెళ్లి సందర్శించండి. వినోదం వస్తుంది. డబ్బు ఆదా అవుతుంది.

174
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles