నాన్నలూ పాలివ్వొచ్చు!


Sun,April 28, 2019 12:52 AM

మాతృత్వం మహిళలకు గొప్ప వరం. తల్లిపాలు బిడ్డలకు ఆవశ్యం. బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లిపాలు చాలా కీలకం. బిడ్డకు స్నానం చేయించడం దగ్గర్నుంచి, ప్రతీపనిలో పాలు పంచుకునే తండ్రి... పాలిచ్చే విషయంలో మాత్రం భాగం పంచుకోలేడు. అయితే ఇకపై తండ్రులు కూడా పిల్లలకు ఎంచక్కా పాలు ఇవ్వొచ్చు.
Brest-Feeding-Father
వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జపాన్‌కు చెందిన దెంత్సూ అనే సంస్థ తండ్రుల కోసం చనుపాలు పట్టించే ఓ అద్భుత పరికరాన్ని తయారుచేసింది. ఈ పరికరాన్ని పురుషులు ఉదరభాగంలో ధరించి ఎంచక్కా పిల్లలకు పాలు పట్టించవచ్చు. అచ్చం అమ్మ పాలు ఇచ్చినట్టుగానే. తల్లి పాలు తాగుతున్నట్టుగానే భ్రమించి, పిల్లలు బుద్ధిగా పాలు తాగి బజ్జుంటారు. తల్లులను కోల్పోయిన పిల్లలతో పాటు తల్లులు వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, ఆఫీసులకు వెళ్లే తల్లులకు కూడా ఈ గాడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ గాడ్జెట్‌కు ఫాదర్స్ నర్సింగ్ అసిస్టెంట్ అనే పేరు పెట్టిన దెంత్సూ.. ఇందులో సరిపడా పాలు నింపి, బ్యాగులా ధరిస్తే చాలని అంటోంది. ప్రయోగాత్మకంగా కొందరు తండ్రులతో డెమో కూడా ఇప్పించింది. అయితే ఈ గాడ్జెట్ ధర ఎంత అనేది ఇంకా తెలియరాలేదు. అందుబాటు ధరలో లభిస్తే మాత్రం తల్లులు ఫుల్లు హ్యాపీ.

494
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles