గడ్డం బాబులకు చేదువార్త


Sun,April 28, 2019 12:52 AM

గడ్డం పెంచడం ట్రెండ్‌గా మారిన నేటి పరిస్థితుల్లో.. గడ్డం బ్యాచ్‌కు ఓ చేదువార్త చెప్పారు పరిశోధకులు. మెడభాగాన్ని, గడ్డం మొలిచిన ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలట. లేకపోతే ప్రమాదకర బ్యాక్టీరియా దాడికి అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Boyfriend-Beard
మేము రోజూ స్నానం చేస్తాం కదా.. మాకెందుకు రోగాలొస్తాయ్ అని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే కుక్క వెంట్రుకలకంటే.. మనిషి గడ్డంలోనే సూక్ష్మజీవులు ఎక్కువగా తిష్టవేస్తుంటాయట. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్‌లోని హిర్స్ లాండెన్ క్లినిక్ చెబుతున్నది. ఈ క్లినిక్ నిర్వహించిన పరిశోధనల వివరాలను చీఫ్ ప్రొఫెసర్ ఆండ్రియాస్ గట్జీట్ వివరించారు. ఈ పరిశోధనల కోసం వివిధ జాతులకు చెందిన 30 కుక్కల నుంచి, 18 మంది మగవారి నుంచి శాంపిల్స్ సేకరించారు. మెడ భాగం దగ్గర రుద్ది తీసిన కాటన్ స్వాబ్‌ని ఎంఆర్‌ఐ చేసి, వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ పరిశోధన ప్రకారం మగవాళ్ల గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉంది. కుక్కల్లో వచ్చే వ్యాధులు మనుషులకు కూడా వ్యాపిస్తాయా? అనే కోణంలో పరిశోధన నిర్వహించడంతో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే అబ్బాయిల గడ్డాలు సూక్ష్మ జీవులకు ఆవాసాలు. గడ్డం పెంచాలనుకునే వారు జాగ్రత్త మరి.

4843
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles