ఇది కేఫ్ ‘పాజిటివ్’


Sun,April 28, 2019 12:52 AM

ఎయిడ్స్ రోగిని చూడగానే ఆమడ దూరం పారిపోయే రోజులు పోయాయి. పాజిటివ్ బాధితులను చేరదీసి.. ఉపాధినిచ్చే మంచి రోజులు వచ్చేశాయ్. ఇందుకు పశ్చిమ బెంగాల్‌లో నడుపుతున్న ఈ కేఫ్ పాజిటివ్ నిదర్శనం.
Cafe-Positive
కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఈ కేఫ్ పాజిటివ్‌లో 10 మంది టీనేజర్లు పనిచేస్తున్నారు. వీరంతా హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులే. ఈ కేఫ్ ఏర్పాటు అంత ఈజీగా కాలేదు. ఇందుకు సుమారు ఆరు నెలలు శ్రమించారు. వారికి స్థలం, షాపులు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ అంగీకరించలేదు. చివరికి నగరంలోనే జోద్‌పూర్ పార్క్‌లో కేఫ్ ఏర్పాటుకు ఓ పెద్ద మనిషి ముందుకొచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న పదిమంది టీనేజర్లూ తల్లిదండ్రులు వదిలేసినవారే కావడం గమనార్హం. ఆఫర్ అనే సంస్థ ఈ కేఫ్‌ను ప్రారంభించింది. హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులు కేవలం అకౌంట్లు, సర్వింగ్, క్లీనింగ్ పనులు మాత్రమే చూసుకుంటారు. కిచెన్ పనుల కోసం ప్రత్యేకంగా వంటగాళ్లను ఏర్పాటు చేశారు. కేఫ్‌లో గ్లాస్ వాల్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల వినియోగదారులు కూడా కిచెన్‌లో వంటకాలు ఎలా తయారవుతున్నాయో చూడొచ్చు. ఇక్కడ వాడే వస్తువులు కూడా డిస్పొజిబుల్. ఏవీ మళ్లీ తిరిగి ఉపయోగించరు. ప్రస్తుతం ఈ కేఫ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది.

302
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles