అమ్మతనానికి.. అందమైన గౌన్లు!


Fri,April 26, 2019 01:12 AM

అమ్మతనం అద్భుతమైన వరం. ఆ సమయంలో అన్ని జాగ్రత్తలూ తప్పనిసరే. దాంతోపాటు కంఫర్ట్ కూడా చాలా ముఖ్యం. పైగా సమ్మర్ మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వదు. అందుకే ఈ సమయంలో లాంగ్ ఫ్రాక్స్ బెటర్ ఆప్షన్. ైస్టెలిష్ లుక్‌తో పాటు. సూపర్‌గా కనిపించే ఆ గౌన్లు మీ కోసం..
Fashan
1. తెల్లని రాసిల్క్‌తో కుట్టిన లాంగ్ గౌన్ ఇది. పూర్తిగా ప్లెయిన్ మెటీరియల్‌తో ఇచ్చాం. కాబట్టి భుజాల దగ్గర, బెల్ట్‌లాగా హెవీగా మగ్గం వర్క్ చేయించాం. ఇందులో మొత్తం బీడ్స్, స్టోన్స్, జర్దోసీ వాడడంతో సూపర్‌గా మెరిసిపోతున్నది.

2. గోల్డెన్ రాసిల్క్ మెటీరియల్‌తో కుట్టిన లాంగ్ గౌన్ ఇది. పైన వైపు బ్లాక్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేశాం. అంతేకాదు.. చున్నీలాగా నడుము దగ్గర నుంచి పై వరకు ఇదే ఫ్యాబ్రిక్‌తో డిఫరెంట్‌గా డిజైన్ చేశాం. బ్లాక్ రాసిల్క్‌తో చేసి పువ్వులను కింద బార్డర్‌లాగా, గోల్డెన్ జరీ థ్రెడ్స్‌తో హ్యాంగింగ్‌లు ఇచ్చాం. ఇదే దుపట్టాకి పైన వైపు బ్లాక్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ బార్డర్‌గా వేశాం. గోల్డెన్ రాసిల్క్ పువ్వుల బ్రౌచర్ డ్రెస్‌కి అదనపు ఆకర్షణగా నిలిచింది.

3. ఈ సమ్మర్‌లో కంఫర్ట్ ముఖ్యం. అందుకే బ్లూ కలర్ ప్రింట్ వచ్చిన కాటన్ ఫ్యాబ్రిక్‌ని లాంగ్ గౌన్‌గా కుట్టాం. పైన కాస్త డిఫరెంట్‌గా కనిపించేందుకు ఇదే ఫ్యాబ్రిక్‌తో కుచ్చులుగా కుట్టాం. కోల్డ్ షోల్డర్స్‌ని దీనికి అదనపు ఆకర్షణ. రెడ్, బ్లాక్ కాటన్ రిబ్బన్ మెటీరియల్‌తో పువ్వు, కుచ్చులు వేలాడేలాగా డిజైన్ చేయడంతో డిఫరెంట్‌గా కనిపిస్తున్నది.
Fashan1
4. కొన్ని కాంబినేషన్స్ సూపర్‌గా కనిపిస్తాయి. అలాంటిదే ఈ కాంబినేషన్ గౌన్. ప్యారట్ గ్రీన్ కలర్‌కి, పింక్ కలర్ చిలుకల ప్రింట్ వచ్చిన ఇక్కత్ పట్టుతో లాంగ్ గౌన్ కుట్టాం. దీనికి పైన వైపు కాంట్రాస్ట్ కలర్ ఉండాలని పసుపు రంగు ఫ్లవర్స్ వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించాం. స్లీవ్స్‌కి మళ్లీ ఇక్కత్ పట్టు వాడడంతో లుక్ అదిరిపోయింది.

5. ైస్టెలిష్‌గా కనిపించేందుకు ఈ డ్రెస్ వేయాల్సిందే! బ్లాక్ కలర్ జార్జెట్‌తో లాంగ్ గౌన్ కుట్టాం. పైన ఇదే మెటీరియల్‌తో కేప్ అటాచ్ చేశాం. ఈ కేప్ స్లీవ్స్‌కి కీ హోల్స్‌లా ఇచ్చాం. దీనికి వైట్ కలర్ రాసిల్క్‌తో పైపింగ్ కాంట్రాస్ట్ లుక్ తీసుకొచ్చింది. కేప్, డ్రెస్ మొత్తం కూడా మల్టీ కలర్స్ పువ్వులను అటాచ్ చేయడంతో వెస్ట్రన్ లుక్ వచ్చింది.

రితీషా సతీష్‌రెడ్డి
ఈశా డిజైనర్ హౌస్
సుచిత్రా, హైదరాబాద్
ఫోన్ : 8500767476
https://www.facebook.com/
eshadesignerworks/

415
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles