ఏనుగులకు పునర్జీవం


Fri,April 26, 2019 01:09 AM

భూమి మీద పుట్టిన ప్రతి జీవీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతకాలి. అది సమస్త జీవరాశికీ ప్రకృతి నుంచి వచ్చిన వరం. కానీ మానవ నాగరిక సమాజంలో కొన్ని ప్రాణులు మనిషి చేతిలో మచ్చికవుతున్నాయి. అలాంటి జీవ జాతుల్లోనివి ఏనుగులు. వాటిని సంరక్షించడానికి కేరళకు చెందిన యువతి సంగీత ఏనుగంత లక్ష్యంతో పనిచేస్తున్నది.
elephant
కేరళలోని వాయనాడ్‌కు చెందిన యువతి సంగీత. ఆమె ఆరేండ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో రోజూ గుడికి వెళ్లేది. ఇలా వెళ్తున్న క్రమంలో అక్కడ కొన్ని ఏనుగులు కనిపించేవి. అవి చాలా బలహీనతగా, కండ్లనుంచి నీరు కారుతూ, తొండం నుంచి రక్తం కారుతూ కనిపించేవి. ఎర్రటి ఎండలో, సంకెళ్లతో కట్టేసిన ఆ ఏనుగులను చూసిన ఆమె హృదయం చలించింది. ఏనుగులకు అలాంటి పరిస్థితి ఎందుకో, కారణం ఏంటో ఆమెకు తెలియదు. కానీ ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రులను, అమ్మమ్మను అడిగేది. సరైన సమాధానం మాత్రం పొందలేకపోయింది. ఆమె పీజీలో జర్నలిజం విద్య అయిపోయాక. వాయిస్ ఆఫ్ ఏషియన్ ఎలిపెంట్స్ సొసైటీని స్థాపించి ఏనుగుల పరిస్థితి మీద దృష్టిసారించింది. కెమెరామన్‌ను వెంటపెట్టుకొని ఏనుగుల వీడియోలు తీయడం మొదలు పెట్టింది. వాటి దయనీయ పరిస్థితులను కెమెరాలో బంధించింది. దీన్నే డాక్యుమెంటరీగా విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీని 2016 మార్చిలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంనాడు ప్రదర్శించారు. దీనికి డజన్ల కొద్ది అవార్డులు, బెస్ట్ డాక్యుమెంట్ అవార్డు, ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డులూ వచ్చాయి. అప్పుడే ఈ డాక్యుమెంటరీ సుప్రీంకోర్డు దృష్టికి వెళ్లింది. వన్యప్రాణులకు రక్షణ కల్పించాలనే తీర్పులు వెలువరించింది. ఇలా సంగీత ఏనుగుల రక్షణ కోసం పాటుపడుతూ, దేశవాప్తంగా అవగాహన కల్పిస్తున్నది.

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles