కదనరంగంలో మహిళా జవాన్లు..


Fri,April 26, 2019 01:08 AM

రక్షణశాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. భారతసైన్యంలో మహిళా జవాన్లకు చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సైన్యంలో మహిళలను భాగస్వామ్యం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీలో మహిళా జవాన్లను నియమించడం ఇదే తొలిసారి.
armey
ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే మహిళలకు సైన్యంలో పనిచేసేందుకు అవకాశమిచ్చాయి. ఆ కోవలోనే భారత్ కూడా మహిళా జవాన్లను నియమించనున్నది. భారత మిలటరీ విభాగంలో విధులు నిర్వర్తించడానికి మహిళలకు ఇప్పటి వరకు అవకాశం రాలేదు. గత కొంతకాలంగా జరుగుతున్న చర్చల ఫలితంగా ఇప్పుడు భారతసైన్యంలో మహిళలకు కూడా అవకాశమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది రక్షణశాఖ. సరిహద్దులో మహిళలకు అవకాశం కల్పిస్తూ అర్హులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుంది. మహిళలను అఫీసర్ల ర్యాంకులో నియమించేవారు. దీనికి భిన్నంగా జవాన్ల కేటగిరీలో కూడా మహిళలను నియమించడం భారతసైన్యం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతసైన్యంలో విధులు నిర్వర్తించడానికి ఇప్పటి వరకు వందమంది మహిళలను ఎంపిక చేసింది. మరింతమందికి అవకాశం కల్పించడానికి రక్షణశాఖ ఆన్‌లైన్ దరఖాస్తు పద్ధతిని ప్రకటించింది. సైన్యంలో మహిళల ప్రవేశం గురించి తీవ్రస్థాయిలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నారు. స్త్రీపురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగచట్టం ప్రకారం సైన్యంలో మహిళలకు కూడా అవకాశం కల్పించారు. మీరు కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటే జూన్ 8 వరకు గడువు ఉంది. 17నుంచి 30యేండ్ల వరకు వయసున్న వారు అర్హులు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే వైద్యపరీక్షలు చేస్తారు. అన్నీ పరీక్షలు పాసైతేనే సైన్యంలో పనిచేసేందుకు అర్హత సాధించినట్టు. శిక్షణ పూర్తయితేనే సైన్యంలో భాగమవుతారు.

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles