ముత్యమంత పసుపు.. ముఖమెంతో మెరుపు


Fri,April 26, 2019 01:05 AM

పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందానికి కూడా మేలు చేస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే పసుపును ఉపయోగించి చర్మకాంతిని ఎలా పొందవచ్చంటే..
turmeric-face-mask
-చేతులపై చర్మం నలుపు తగ్గాలంటే పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, వేళ్లకు రాసి, స్క్రబ్ చేసి పదినిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. దీనివల్ల చేతులపై నలుపు తగ్గుతుంది.
-టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, ఆఫ్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించాలి. చల్లారాక రాత్రి పడుకునే ముందు చేతులను శుభ్రపర్చుకుని రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
-గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పసుపులో కొన్ని పాలు కలుపుకుని ముఖానికి రాసుకుని గంటసేపు ఉంచుకుని కడిగితే నిగారింపుగల చర్మం మీ సొంతమవుతుంది.
-కొందరి ముఖం పాలిపోయినట్లుగా తేమ లేకుండా ఉంటుంది. అలాంటి వారు పసుపు, చందనం రెండింటినీ పాలమీగడతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడిగితే ముఖంలో తేజస్సు పెరుగుతుంది.
-వేపాకు, పసుపు కలిపి నీళ్లలో వేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. పసుపు, చందనం పొడి, రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పూసి, కొంతసేపటి తర్వాత కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు మాయమవుతాయి.

207
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles