ఆరోగ్యానికి ఫుల్ సపోర్ట్ సపోటా


Fri,April 26, 2019 01:03 AM

సహజ సిద్ధంగా లభించే వాటిల్లో సపోటా ఒకటి. పోషక విలువలు అధికంగా ఉన్న పండు. ఈ పండు తింటే రుచికరంగా ఉంటుంది. తేలికగా జీర్ణమవుతుంది కూడా. సపోటా పండు వల్ల లాభాలేంటంటే..
sapota
-సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది విటమిన్ ఏ ని అధికంగా కలిగి ఉంటుంది. విటమిన్ ఏ వృద్ధాప్యంలో కూడా కంటి చూపును మెరుగు పర్చడానికి సాయపడుతుంది. అందువల్ల మంచి దృష్టికి సపోటా పనిచేస్తుంది.
-సపోటా టన్నిన్‌ని అధికంగా కలిగి ఉండడం వల్ల ముఖ్యమైన యాంటీ- ఇంప్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఎసోఫాగిటిస్, పేగు శోధము, చికాకు పెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణకు ఈ పండు ఉపయోగపడుతుంది. వాపును, నొప్పిని తగ్గించడానికి మంటను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది.
-ఇందులోని విటమిన్ ఏ, బి చర్మ ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడతాయి. సపోటాలోని యాంటీఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఏ ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుంచి రక్షణ ఇస్తుంది.
-సపోట పండు ఉపశమనకారి కావడం వల్ల నరాల ఉధృతిని, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు చాలా మేలు చేస్తుంది.
-సపోటా పండు చర్మ కాంతికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల, చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల సపోటా పండు తినడం చర్మానికి ఎంతో మంచిది.

265
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles