విదేశాలకు వెళ్తున్నారా?


Fri,April 26, 2019 12:56 AM

Aircraft
ఉన్నత విద్య కోసం, ఉపాధి కోసం, సందర్శన కోసం.. ఇలా రకరకాల కారణాల వల్ల విదేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. విదేశీయానం అంటే అదో అందమైన, అద్భుతమైన ప్రయాణం. మొదటిసారి విదేశీ ప్రయాణం చేసేవాళ్లకు అనుభవం, అవగాహన లేకపోవడం వల్ల లక్షల రూపాయలను నష్టపోతుంటారు. మొదటిసారి విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ చిన్న విషయాలు, ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే ఎలాంటి అసౌకర్యం కలుగదు.
pasaporte1
ఎక్స్‌ట్రా పాస్‌పోర్ట్ : ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో పాటు, కలర్ జిరాక్స్ కాపీలను కూడా వెంటపెట్టుకోవాలి. అవసరం అయితే తప్ప ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ను వాడకూడదు. ఒకవేళ దొంగతనానికి గురయినా ఎక్కడికి పోయినా సురక్షితంగా ఉండగలుగుతారు. ఎవరైనా ప్రశ్నించినా మన సిటిజెన్‌షిప్‌ని జిరాక్స్ కాపీ చూపించి నిరూపించుకోగలుగుతాం. కొత్త వ్యక్తులకు పాస్‌పోర్ట్ ఇవ్వకపోవడం మంచిది. అవసరం అయితే పాస్‌పోర్ట్‌ను ఈమెయిల్‌లో కూడా అటాచ్ చేసి పెట్టుకుంటే మంచిది.
health
ఆరోగ్య పరీక్షలు: విదేశాలకు వెళ్లే ముం దు ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే బాగుంటుంది. కంపెనీల నుంచి వెళ్తే ఆయా సంస్థలు వైద్య పరీక్షలు చేయిస్తాయి. వ్యక్తిగత ప్రయాణాలు చేసేవాళ్లు సొంతంగా చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకునే శక్తి ఉందా లేదా అన్న విషయం తెలిసిపోతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే మరీ మంచిది. ఉన్నవాళ్లు అది విదేశాల్లో పనిచేస్తుందా లేదా అన్న విషయాన్ని క్లారిటీగా కనుక్కోవాలి. ఒకవేళ అక్కడ మీ ఇన్సూరెన్స్ పనిచేయకపోతే ఏది పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అన్న విషయాలను తెలుసుకుంటే బాగుంటుంది.
cosulate
రిజిస్టర్ చేసుకుంటే : సందర్శన కోసం వెళ్లినా, ఉపాధికోసం వెళ్లినా రాయబార, దౌత్య కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకుంటే మంచిది. విదేశాల్లో హఠాత్తుగా ప్రమాదం జరిగినా, ఇంకేలాంటి నష్టం జరిగినా ఇక్కడి ప్రభుత్వం మిమ్మల్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని ఎలాంటి సాయం చేయడానికైనా ఆలస్యం జరుగదు. రిజిస్టర్ చేసుకుంటే లాభమే తప్ప నష్టం ఉండదు. చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు.
curency
కరెన్సీ విలువ : ఏ దేశానికి వెళ్తున్నారు. అక్కడి కరెన్సీకి విలువ ఎంత ఉన్నది వంటి అంశాలను ముందు తెలుసుకోవాలి. ద్రవ్యమార్పిడి ఎలా ఉంటుంది అన్న విష యం తెలుసుకుంటే మామూలుగా ఒక అంచనాకు రావొ చ్చు. అక్కడ ఏం కొనుగోలు చేసినా సరైన లెక్కలు చేసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు అన్నిచోట్లా పనిచేయకపోవచ్చు. కాబట్టి బస్సులు, ట్రైన్స్ వంటి చోట నగదును వాడాలి. మీ దగ్గర ఎప్పుడూ అక్కడి స్థానిక ధనం నగదు రూపంలో ఉండేటట్టు చూసుకోవాలి.
food
ఆహారం : అక్కడి ఆహా రం ఎలా ఉంటుందో తెలియదు. ఒక అంచనా ప్రకారం మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి తక్కువ మోతాదులో తింటేనే మంచిది. అలవాటు లేని వారికి తొందరగా అరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. జంక్ ఫుడ్‌ను అవాయిడ్ చేస్తే మంచిది. వేర్వేరు సంప్రదాయాల ఆహారాలు లభించే చోట జస్ట్ టేస్ట్ చేసి వదిలేస్తే సరి. ఇప్పుడు ప్రపంచం అంతటా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లొచ్చు.

251
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles