సహజ అందం కోసం..


Wed,April 24, 2019 12:10 AM

సహజంగా లభించే వాటితో ముఖకాంతి పొందవచ్చు. మందార చెట్టు, దోసకాయ, ఆరెంజ్ జ్యూస్‌తో చర్మ నిగారింపు పొందవచ్చు. ఈ చిట్కాలు పాటించి
అందం మీ సొంతం చేసుకోండి..

flower
మందార పువ్వుల్లో చర్మ సంరక్షణకు ఉపయోగపడే గుణాలుంటాయి. ఈ పూలను ఎండబెట్టి కాసిన్ని పాలతో కలిపి పేస్టులా చేసుకుని చర్మానికి రాసుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు చేస్తే చర్మ కాంతి లభిస్తుంది.

రోజూ రాత్రి పడుకునే ముందు దోసరసాన్ని కళ్లకింద రాసుకుని 15 నిమిషాలు ఉంచి కడిగేస్తే కళ్లకింద నలుపు పూర్తిగా తగ్గిపోతుంది. టమాటా రసం పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నా ఫలితం ఉంటుంది.

మందార ఆకుల పేస్టును తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. దీని నూనెతో తలకు రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. జుట్టు రాలడానికి కారణం అయ్యే చుండ్రు సమస్యను కూడా ఈ నూనె ద్వారా పరిష్కరించుకోవచ్చు.

నెరిసిన వెంట్రుకలు నిగనిగలాడాలంటే.. రాత్రి పెరుగులో నాలుగు చెందాల మందార ఆకుల పొడి, సరిపడేంత గోరింట పొడులను నానబెట్టాలి. ఉదయాన్నే కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా ఇన్‌స్టంట్ కాఫీ పొడి కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి.

కళ్ల చుట్టూ ఉండే చర్మం నల్లగా ఉన్నా.. కంటి కింద వలయాలు వేధిస్తున్నా.. ఆరెంజ్ జ్యూస్, గ్లిజరిన్‌లను కలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం తేటగా తయారవుతుంది.

202
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles