సహారా ప్రయత్నం.. అందరిలో మార్పు..


Wed,April 24, 2019 12:08 AM

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు బెంగళూరుకి చెందిన సహారా.. రోజూ మనం వాడే ప్లాస్టిక్‌కు, రసాయనాల కాస్మొటిక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులు తయారు చేస్తూ అందరినీ ఆలోచింపజేస్తున్నది.
sahar-mansoor
బెంగళూర్‌కు చెందిన సహారా మన్సూర్‌కు పర్యావరణం అంటే ప్రాణం. ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో నేర్చిన పాఠాలు పరీక్షలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడాలి అనుకునేది. ఇంజినీరింగ్ తర్వాత స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)లో పనిచేసింది. స్విట్జర్లాండ్‌లో పనిలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండేది. దానిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ప్లాస్టిక్ వాడకం వల్లే ఎక్కువ మంది ఆనారోగ్యానికి గురవుతున్నారని అక్కడి నుంచి 2015లో బెంగళూరుకు వచ్చింది సహారా. దానికి పరిష్కారం కోసం ఆలోచనలు పెట్టింది. రోజూ వేలల్లో పగులుతున్న పగిలిన గాజులను, వాడిన శానిటరీ నాప్కిన్లను, సిరంజి వ్యర్థ పదార్థాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని ఆపాలనుకున్నది. ప్లాస్టిక్ షాంపూ బాటిల్, టిఫిన్ బాక్స్, టూత్‌బ్రెష్‌లను సహార మొదట నివారించింది. మరుగుదొడ్ల శుభ్రతకు వాడే రసాయనాలకు బదులుగా పర్యావరణానికి హాని కలుగకుండా తనే సొంతంగా మందులు తయారు చేసింది. చిన్నగా సబ్బులు, షాంపూ, మాయిశ్చరైజర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాడక్ట్స్‌ని ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే మై జీరో వేస్ట్ స్కిన్ కేర్ రొటీన్ పేరుతో హోండెలివరీ చేయడం మొదలుపెట్టింది. ఇలా ప్రారంభమైన ఆమె లక్ష్యం కొద్ది రోజుల్లోనే బిజినెస్‌గా మారింది. ఇలా సహార ప్టాస్టిక్‌కు, రసాయన కాస్మొటిక్స్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తయారు చేస్తున్నది. దేశ వ్యాప్తంగా కస్టమర్లను పొందగలుగుతున్నది.

268
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles