ఈ ఆటలు ఇక చాలు!


Wed,April 24, 2019 01:48 AM

banned
మనం వాడుతున్న మొబైల్ బోర్ కొట్టకుండా ఉండాలంటే.. అందులో కొన్ని యాప్స్ తప్పనిసరి. అందులోనూ.. స్మార్ట్‌ఫోన్ అంటే.. యాప్‌లు లేకుండా ఎలా? ఆ క్రమంలోనే ఎన్నో యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో పుట్టుకొచ్చాయి. కొన్ని మన రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తే.. మరి కొన్ని యాప్స్ నవ్వులపాలు చేశాయి. అలాంటి యాప్స్ బారిన సామాన్యులు మాత్రమే కాకుండా.. బాధ్యతాయుత హోదాలో ఉన్నవారు కూడా పడ్డారు. అందుకే.. అలాంటి యాప్స్ మీద ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఏదైనా శృతి మించితే మంచిది కాదని పెద్దలు ఎప్పట్నుంచో చెప్తున్నారు. కానీ.. మనమే ఆ మాట పెడచెవిన పెట్టి.. చెవి మెలిపెట్టి చెప్పేంత వరకు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గేమింగ్ సంగతి కూడా అంతే. పబ్‌జీ గేమ్ ఎక్కువగా ఆడొద్దు అంటే వినలేదు. ఫలితంగా దాన్ని నిషేధించే వరకు తెచ్చారు. ఇప్పుడు సరదా పంచే టిక్‌టాక్‌ని సైతం నిషేధించేలా అతి ఈ రెండు యాప్స్ మాత్రమే కాదు.. ఇంకా చాలా యాప్స్ నిషేధానికి గురయ్యాయి. అవేంటంటే..?

టిక్‌టాక్

tik-tok-featured
మొన్నటి వరకు సకుటుంబ సపరివార సమేతంగా టిక్‌టాక్‌లో వచ్చే ఆడియోకి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. ైస్టెల్‌గా నటించి అందరి మెప్పు పొందారు చాలామంది టిక్‌టాక్ యూజర్లు. సరదాగా ఉన్నంత వరకు ఏ సమస్యా ఉండదు. కానీ.. మితిమీరితేనే సమస్య మొదలవుతుంది. దాని మీద చర్యలు కూడా మొదలవుతాయి. టిక్‌టాక్ కూడా అంతే.. మొదట్లో సరదా పంచింది. కానీ.. ఆ సరదా కాస్త హద్దు మీరి అధికారులు, పలువురు రాజకీయ నాయకుల మనోభావాలు దెబ్బతీసేలా, వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించేలా, అసభ్య ప్రదర్శనకు వేదికగా మారింది. దీంతో ఆ టిక్‌టాక్ ఇప్పుడు నిషేధానికి గురయింది.

పబ్‌జీ

PUBG
అప్పుడప్పుడు సరదాగా, ఎటూ పొద్దుపోకపోతే నలుగురితో ముచ్చట్లు పెట్టుకునే బ్యాచ్ కాస్త... స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని మొబైల్ గేమ్స్‌కి అలవాటు పడింది. అది గమనించిన యాప్ డెవలపర్లు కుప్పలు తెప్పలుగా గేమింగ్ యాప్స్ తయారుచేసి జనాల మీదకు వదిలారు. అందులో కొన్ని ఫన్‌ని పంచే యాప్స్ ఉంటే.. కొన్ని ప్రమాదాన్ని కొనితెచ్చే యాప్స్ ఉన్నాయి. ఆ కోవలో ఈ మధ్యనే నిషేధానికి గురైన యాప్ పబ్‌జీ. ఈ గేమ్‌కి బానిసై ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్న ఘటనలు మనం చాలానే చూశాం. యువత, దేశ భవిత గురించి ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు పబ్‌జీని నిషేధించాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పబ్‌జీ నిషేధితమైంది.

బ్లూ వేల్

blue-whale
మనిషిని మానసికంగా లోబరుచుకునే మొబైల్ గేమ్‌ల తయారీ పెరిగిన క్రమంలో వచ్చిన గేమ్ ఇది. ఒక్కసారి ఈ ఆటలోకి ఎంటరైతే అంత సులభంగా బయటకు రాలేం. ఈ ఆటకు బానిసై చాలామంది తమని తాము గాయపరుచుకోవడం, ఇతరుల మీద దాడిచేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటే ఈ గేమ్ అడిక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో మెల్లగా ఈ గేమ్‌కి అలవాటయ్యేలా చేసి క్రమంగా ఆత్మహత్యకు పురిగొల్పే గేమ్ ఇది. అందుకే ఇలాంటి గేమ్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

పోకెమాన్ గో..

pokemon-go
జీపీఎస్ ఆధారంగా ఆడే ఈ గేమ్ మాయలో పడి యువత గతంలో రోడ్ల మీద పరుగులు తీసింది. ఈ గేమ్ వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు, మరణాలు జరిగాయి. అతి తక్కువ కాలంలో విస్తరించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయింది పోకెమాన్ గో గేమ్. ప్లేస్టోర్‌లో విడుదలైన తక్కువ రోజుల్లోనే 500 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇంకా చాలా ఉన్నాయి..

This-Why
ఈ మధ్యకాలంలో చర్చనీయాంశమై, వివాదాస్పదంగా మారిన మొబైల్ గేమ్స్, యాప్స్‌లకు ఉదాహరణగా ఈ నాలుగు గేమ్స్ గురించి ఇక్కడ చర్చించాం. ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్, యాప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. సమాజానికి ప్రమాదం అని గుర్తించి ప్రభుత్వమే చొరవ తీసుకొని కొన్ని యాప్స్ మీద నిషేధం విధించింది. వాటిలో.. యూట్యూబ్ నుంచి వీడియోలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే ట్యూబ్‌మేట్‌యాప్, పాప్‌కార్న్ టైమ్, యాడ్ అవే, లక్కీ పాచర్, గ్రూవ్‌షార్క్, పీఎస్‌ఎక్స్4డ్రాయిడ్, అమేజాన్ అండర్‌గ్రౌండ్, వెయిబో, వీచాట్, షేర్‌ఇట్, ట్రూకాలర్, యూసీబ్రౌజర్, బ్యూటీప్లస్, న్యూస్‌డాగ్, వివా వీడియో, క్యూయూ వీడియో, పారలాల్‌స్పేస్, ఆపస్ బ్రౌజర్, పర్‌ఫెక్ట్ కార్ప్, వైరస్ క్లీనర్, సీఎం బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, డ్యూ రికార్డర్, 360 సెక్యూరిటీ, చీతా మొబైల్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, వీడియోకాల్ షియోమీ, క్యూక్యూ- లాంచర్, సెల్ఫీసిటీ లాంటి చాలా యాప్స్‌ను గూగుల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలగించింది. ఇప్పటికీ ఇలాంటి యాప్స్ మీ మొబైల్‌లో ఉంటే వీలైనంత త్వరగా అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. ఇలాంటి యాప్స్‌తో వ్యక్తిగత సమస్యలతో పాటు మన వ్యక్తిగత సమాచారమంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

217
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles