స్మార్ట్‌ఫ్యాన్ వచ్చేసింది!


Wed,April 24, 2019 01:42 AM

ప్రపంచమంతా స్మార్ట్‌గా మారిపోతున్నది. అందుకే.. నిత్యం వాడే వస్తువులు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. చేతిలోని మొబైల్ మొదలు.. టీవీ, ఇంటికి వేసే తాళం, అన్నం వండుకునే పాత్రలు ఇలా ఒక్కటేమిటి నిత్యావసర వస్తువులన్నీ స్మార్ట్ అవతారం ఎత్తుతున్నాయి. ఈ కోవలోకి ఇప్పుడు ఫ్యాన్ కూడా చేరింది.
fAN
అవును.. మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫ్యాన్ వచ్చేసింది. ఇప్పటికే చాలా వస్తువులు మామూలు రూపం నుంచి స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ కూడా స్మార్ట్‌గా అప్‌డేట్ అయింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సపోర్ట్‌తో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఓరియంట్ కంపెనీ తయారుచేసిన ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఆపరేట్ చేయడానికి స్విచ్ అవసరం లేదు. మనం ఎలా చెబితే అలా నడుచుకుంటుందీ ఫ్యాన్. ఆగిపో.. అని ఆదేశిస్తే చాలు.. ఠక్కున ఆగిపోతుంది. తిరుగు అని చెప్తే చాలు.. మన మాటల్ని తు.చ. తప్పకుండా పాటిస్తుంది. రాజుల కాలంలో చిత్తం మహాప్రభూ అంటూ సేవలు చేసే సేవకుడిలా మనకు ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా తిరుగుతుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సాయంతో మనం చెప్పినట్టు వినే ఈ స్మార్ట్‌ఫ్యాన్ ఏ టైమ్‌లో ఆన్ కావాలి, ఎంత తిరగాలి? ఎంతసేపు తిరగాలి? వంటి ఆప్షన్స్ అన్నీ టైమింగ్ సహా సెట్ చేసుకోవచ్చు. ఫ్యానంటే కేవలం గాలి మాత్రమే కాదు. దీనికి లైట్ కూడా బిగించి ఉంటుంది. ఒక్క స్విచ్‌తో అటు ఫ్యాన్, ఇటు లైటు రెండూ ఆన్ చేయొచ్చన్నమాట. ఇన్ని ఫీచర్లున్నాయి కదా! ఈ ఫ్యాన్‌కు కరంటు కూడా బాగానే ఖర్చవుతుందనుకుంటే పొరపాటే. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఇన్వర్టర్ మోటార్ అమర్చారు. దీంతో ఈ స్మార్ట్‌ఫ్యాన్ తక్కువ కరంట్ వినియోగించుకొని పనిచేస్తుంది. అలా కరంట్ ఆదా చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ని ఆపరేట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో ఈ ఫ్యాన్ ఆపరేట్ చేయొచ్చు. ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. మన ఇండియా మార్కెట్లోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చు. ఇక ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫ్యాన్ ధర సుమారు 8 వేల రూపాయలు. కావాలనుకునే వారు ఓరియంట్ ఎలక్ట్రానిక్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

231
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles