శామ్‌సంగ్.. మడత పెట్టేసింది!


Wed,April 24, 2019 01:40 AM

మొబైల్స్ టెక్నాలజీ విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి సరికొత్త అధ్యాయాలు సృష్టించింది శామ్‌సంగ్. ఇప్పుడు మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌తో మరో సంచలనం సృష్టించింది. త్వరలో పరిచయం చేయనున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ విశేషాలు మీకోసం..
Galaxy--foldable
పెద్ద తెర, స్పీడ్‌గా పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్, మంచి క్వాలిటీ ఉన్న సౌండ్, కావాల్సినంత స్టోరేజీ, అద్భుతమైన కెమెరాలు, సరిపడా బ్యాటరీ బ్యాకప్ ఇవన్నీ కలిపి ఒకచోట మడతబెడితే వచ్చిందే.. శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్. రెండువైపులా డిస్‌ప్లేతో తొలిసారి మార్కెట్లోకి రానున్న ఈ మొబైల్ మార్కెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనమే సృష్టించనుంది. ఏదైనా ఫొటో, వీడియో పెద్ద సైజులో చూడాలనుకుంటే డిస్‌ప్లేను తెరిచి పెద్దగా చేసుకోవచ్చు. వద్దనుకుంటే మడిచి మనకు కావాల్సిన సైజులోకి మార్చుకోవచ్చు. అంటే.. పుస్తకాన్ని మడిచి పెట్టినట్టుగా ఈ మొబైల్‌ని కూడా మడిచి జేబులో పెట్టుకోవచ్చన్నమాట. ఈ మొబైల్ డిస్‌ప్లే సైజు 7.3 అంగుళాలు. ఇంతపెద్ద ఏఎంఎల్‌ఈడీ తెర కలిగిన మొబైల్ ఇప్పటి వరకు మార్కెట్లో లేదు. 12+12+16 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరాలు, 18+8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరాలతో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఈ మొబైల్లో పొందుపరిచారు. 12జీబీ ర్యామ్‌తో మల్టీ టాస్కింగ్ కూడా వేగంగా, సులభంగా చేయగలదు. బ్యాటరీ విషయానికొస్తే.. ఫోన్‌కి తగ్గట్టే 4380 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ బ్యాకప్ అమర్చారు. వేగంగా చార్జింగ్ అయి, నిదానంగా తగ్గుతుందన్నమాట. ఇంటర్నల్ మెమొరీ విషయానికొస్తే.. 512 జీబీ. మీ జీవితానికి సరిపడా ఫైల్స్ అన్నీ ఈ మొబైల్లో దాచుకోవచ్చు. ఇన్ని హంగులతో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా లక్షా 40 వేల 790 రూపాయలు. స్పేస్ సిల్వర్, కాస్మస్ బ్లాక్, మార్టిన్ గ్రీన్, ఆస్ట్రో బ్లూ రంగులలో ఈ మొబైల్‌లో మార్కెట్‌లో కనువిందు చేయనుంది. రెడీగా ఉండండి మరి!

157
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles