సంగీతా శర్మ


Mon,April 22, 2019 12:49 AM

-రసాయన రహిత వ్యవసాయం సాధ్యమేనంటున్న

వ్యవసాయం అనగానే ఒకప్పుడు పాడిపంటలు గుర్తుకు వచ్చేవి.కానీ నేడు ప్రాణాంతక మందులే గుర్తుకు వస్తున్నాయి.ప్రకృతి సిద్ధంగా చేయాల్సిన వ్యవసాయాన్ని మందులతో నింపి విషపు పంటలు పండిస్తున్నాం. అయినా అనుకున్నంత పంట దిగుబడి రాక ఆరుగాలం శ్రమించే అన్నదాత అప్పుల పాలవుతున్నాడు. ఒక వస్తువును ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారునికి తన వస్తువు ధరను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తన స్వేదాన్ని చిందించి పండించిన పంటకు తను ధర నిర్ణయించుకోలేని పరిస్థితి నేటి రైతుది. అందుకే అలాంటి రైతుల్లో మనోధైర్యం నింపాలనే సంకల్పంతో విత్తన బ్యాంక్‌ను స్థాపించారామె. తద్వారారైతులకు ఉచితంగా విత్తనాలుఅందజేస్తూ 20వేల మందికి పైగారైతులకు ఆసరాగా నిలిచారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను అందించడం కోసం విత్తనాలు సేకరించడం, అవసరమైనవారికి అందించడం కోసం అన్నదాన పేరుతో సంస్థను ప్రారంభించి కొత్త వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన సంగీతా శర్మ సక్సెస్‌మంత్ర.
Sangitha-Sharma
సంగీతది బెంగళూరు. ఆమెకు వ్యవసాయం కొత్తేమీ కాదు. చిన్నతనంలో తన తండ్రితో కలసి ఆ మట్టివాసనను ఆమె అనుభవించింది. నిజానికి ఆమె తండ్రి పరమానందశర్మ భారత సైన్యంలో మేజర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ పొందాక ఊరి శివార్లలో కొంత భూమిని కొనుగోలు చేసి గోపతి ఫార్మ్స్ పేరుతో వ్యవసాయం, డెయిరీ ఫారంను మొదలుపెట్టారు. స్వచ్ఛమైన పంటలు పండించేవారు. అలా ఆమెకు వ్యవసాయం పట్ల అవగాహన ఏర్పడింది. ఆసక్తినీ పెంచుకున్నారు. అయితే పెద్దయ్యాక ఉన్నత చదువుల కోసం ఆమె విదేశాల బాట పట్టాల్సి వచ్చింది. సింగపూర్, గల్ఫ్ ఎయిర్‌లైన్స్, ఖలీజ్ టైమ్స్, దుబాయ్ అల్యూమినియం తదితర సంస్థల్లో పని చేశారు.

విషాహారం తింటున్నట్లు

ఇండియాలో ఉన్నప్పుడు తమ వ్యవసాయ భూమిలో పండిన పంటలు తిన్న అలవాటు సంగీతది. అలాంటిది విదేశాల్లో తిన్న ప్రతిసారీ ఇంటి భోజనానికి దూరమయ్యాననే బాధ ఆమెలో కలిగేది. ఆరేండ్ల పాటు విదేశాల్లో పనిచేసిన ఆమె రోజువారి భోజనం రసాయనాలున్న విషాహారాన్నే తింటున్నట్లు భావించేది. అసలు ఎలాంటి రసాయనాలు లేకుండా పంటలు పండించలేమా? అని ఆలోచించింది. రసాయన రహిత పంటలను పండించడమెలాగో అధ్యయనం చేయాలనుకుంది. తన సంకల్పానికి అడ్డు ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చారు.

సేంద్రియ పంట మొదలుపెట్టి

భారతదేశానికి తిరిగి రావడంతోనే అనేక మంది రైతులను ఆమె స్వయంగా కలుసుకున్నారు. ఎంతోమంది రైతుల అభిప్రాయాలను సేకరించారు. రైతులతో మాట్లాడాక ఆమెకు అనేక విషయాల పట్ల అవగాహన ఏర్పడింది. వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సంకల్పించారు. రెండేండ్లు విరామం లేకుండా తిరిగారు. వ్యవసాయంపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయంలో వచ్చే నష్టాలకు విత్తనం, ఉపయోగించే రసాయాలనాలే అని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు సంగీత. భూమి అంటే తల్లి గర్భంతో సమానం. రసాయనాలు వేస్తే పుట్టే బిడ్డకు, తల్లికీ ప్రమాదమే. అలాగే నకిలీ విత్తనాలు, పంటలకు వేసే పలురకాల మందులతో నేలతల్లి జబ్బుపడుతున్నది. పంటలూ ఆరోగ్యకరంగా లేవు. అందుకే మూలాలను శుద్ధి చేయాలనుకున్నా. ముందుగా రసాయన రహిత విత్తనాలను సిద్ధం చేయాలనుకున్నా. అందుకోసం బెంగళూరు శివారులోని సింగపురాలో 12 ఎకరాల భూమిని కొన్నా. కేవలం సేంద్రియ ఎరువులతోనే పంటను పండించడం మొదలుపెట్టి, ఏడాదిలోపే స్వచ్ఛమైన విత్తనాలను సేకరించేందుకు ప్రయత్నించా. ఎందరో రైతుల నుంచి పురాతన వ్యవసాయ సంప్రదాయాలు, అనుభవాలు, పాఠాలను ఎప్పటికప్పుడూ తెలుసుకొంటూనే ఉన్నా అని అంటున్నది సంగీత.
bangalore

విత్తనాల సేకరణకు అన్నదాన

నిజానికి వ్యవసాయంలో మార్పులు రావాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలే ముందుకు రావాల్సిన అవసరం లేదన్నది సంగీత అభిప్రాయం. రైతులు తమ అనుభవాలకు తోడు కొన్ని ఆధునిక పద్ధతులను జతచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని సంగీత విశ్వసించారు. అధిక దిగుబడి కోసం ఎక్కువ మొత్తంలో రసాయ నాలు వాడడం, పురాతన పంట విధానాన్నే అవలంభించడం వల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారన్నది ఆమె ఆభిప్రాయం. దీంతో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని గ్రహించింది. అందుకే అన్నదాన పేరుతో ఒక విత్తన వితరణ సంస్థను ప్రారంభించారు. పండించిన ప్రతి పంట నుంచీ విత్తనాలను సేకరించడం ఆ సంస్థ ఉద్దేశం. అలా లక్షల విత్తనాలను ఆమె సేకరించారు. అలాగని పంటలన్నింటిని కొనుగోలు చేయలేదు. తన మేధోశక్తితో విత్తన సేకరణ ప్రారంభించారు. ఒక క్యారెట్ నుంచి లక్షాయాభై వేల విత్తనాలను సేకరించొచ్చు. అలాగే టొమాటో, వంకాయలను సరైన పద్ధతిలో పండిస్తే లక్షలాది ఆర్గానిక్ విత్తనాలను ఇస్తాయని అనిపించింది. ఇవన్నీ గుర్తించి విత్తనాలను భద్రపరచడానికి ఓ బ్యాంకును ప్రారంభించా. వీటిని మా అన్నదాన సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పంపిణీ చేస్తున్నా. ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్న పలుప్రాంతాల్లో లక్షలాది ఆర్గానిక్ విత్తనాలను ఉచితంగా పంచిపెట్టా. ఇటీవల కూర్గ్, కేరళలో అయిదు లక్షల ఆర్గానిక్ కూరగాయ విత్తనాలను అందించా. ఇప్పుడు 26 ఎకరాల్లో పంటలను పండిస్తున్నా. ప్రస్తుతం 800 రకాల కూరగాయల విత్తనాలు మా బ్యాంకులో ఉన్నాయి. 27 రకాల బియ్యాన్ని పండిస్తున్నాం అని అంటున్నదామె.
Annadana-Western-Ghats

మై రైట్ టు సేఫ్ ఫుడ్

కేవలం ఎవరో ఒక్కరు పండిండం కాదు. ప్రతి ఒక్కరు మంచి ఆహారాన్ని పండించడాన్ని హక్కుగా భావించాలని సంగీత అంటారు. ఆమె శిక్షణ తరగతులు తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి రైతులు ఆమె దగ్గరికి వచ్చి తమ సందేహాలు తీర్చుకోవడమే కాదు... ఆర్గానిక్ విత్తనాలనూ తీసుకుంటున్నారు. ఈ 20 ఏండ్లలో దాదాపు 20వేల మంది రైతులకు అవగాహనా తరగతులను నిర్వహించింది. భూటాన్, వెనీజులా, మలేషియా నుంచి విద్యార్థులు, రైతులు ఆమె తరగతులకు హాజరవుతున్నారు. మై రైట్ టు సేఫ్ ఫుడ్ పేరుతో ప్రచారాన్ని మొదలుపెట్టిందీమె. సహజసిద్ధమైన వ్యవసాయం చేయాలంటూ పిలుపునిస్తున్నది.. సీడ్ ఎక్ఛ్సేంజీ మేళాను పలు రాష్ర్టాల్లో నిర్వహిస్తూ, అక్కడివారి విత్తనాల పరిశీలనతోపాటు వారికి అవసరమైన విత్తనాలను అందిస్తున్నది. శ్రమ ఫలిస్తే భవిష్యత్తులో రసాయన రహిత ఆహారం అందుబాటులోకి రావడం ఎంతో దూరంలో లేదన్నది వాస్తవం అంటున్నది సంగీత.successtitle"/>

అవగాహనే లక్ష్యంగా

ఆర్గానిక్ పంటలు పండించడం, రసాయన ఎరువులను నివారించడం వంటి కార్యక్రమాలు కేవలం తాను పాటించి పండిచండమే కాకుండా అందరికీ ఈ విధానం పట్ల అవగాహన, శిక్షణ అందించాలనుకుంది. అందుకే గోపతి ఫార్మ్స్‌లోనే వర్క్‌షాపులను నిర్వహిస్తున్నది. అయితే ఈ వర్క్‌షాపులు ఇప్పటి రైతులకు ఏ మాత్రం అర్థం కాకపోవచ్చు. అందుకే విద్యార్థి దశ నుంచే రేపటితరానికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నది. అలా ఇప్పటివరకూ వేలాదిమంది వ్యవసాయ విద్యార్థులకు శిక్షణనిచ్చింది. పట్టణాలలో ఉండే అతి కొద్ది స్థలం లేదా బాల్కనీ, మేడపై ఆరోగ్యకరమైన కూరగాయలనెలా పండించుకోవాలో నేర్పిస్తున్నది.

అవార్డులు

-వ్యవసాయ రంగంలో సంగీత చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వంఎన్విరాన్‌మెంట్ కన్సర్వేషన్
- ఆర్గానిక్ బయో డైవర్సిటీ ప్రొటెక్షన్ పేరుతో ఇన్స్‌ఫైర్
అవార్డుతో గౌరవించింది. కర్ణాటక ప్రభుత్వం గతేడాది విమెన్ అచీవర్స్ అవార్డును అందించింది.

504
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles