అందానికి.. ఆరోగ్యానికి తేనె


Mon,April 22, 2019 12:40 AM

చర్మాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటంలో సహజమైన పద్ధతి.. తేనెను ఉపయోగించుకోవడం. దానిలోని యాంటీ బాక్టీరియా, హైడ్రేట్ లక్షణాలు వయస్సుకు తగ్గ శక్తిని ఇస్తాయి.
honey
-చర్మానికి సహజత్వాన్ని అందివ్వడంలో, ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు నివారించడంలో తేనె చక్కగా పని చేస్తుంది.
-రెండు స్ఫూన్‌ల తేనెలో కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్ధనా చేసుకుంటే చర్మం కాంతిమంతం అవుతుంది.
-తేనె, పెరుగు, నిమ్మరసాన్ని పెదాలపై మర్ధనా చేస్తే పెదాలు తేజోవంతమవుతాయి.
-అందానికి ఎంతో ఉపయోగపడే తేనె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
-కేవలం చర్మంపై కాకుండా జుట్టు మీద కూడా తేనెను ఉపయోగించవచ్చు. దీనిలోని ఎంజైమ్‌లు జుట్టును మాయిశ్చరైజింగ్‌గా మార్చుతాయి. కొద్దిగా కొబ్బరి నూనె, తేనె తీసుకుని రెండింటినీ తలపై రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
-కంటికి అవసరమైన విటమిన్-ఎ శరీరం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది.

423
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles