వైకల్యం ఓడింది.. ఆమె గెలిచింది!


Mon,April 22, 2019 12:39 AM

శరీరంలో ఏ అవయవం లేకపోయినా దాని వల్ల సమస్య కనిపిస్తుంది. కానీ ఓ యువతి తనకు వైకల్యం ఉందని ఏమాత్రం బాధపడుకుంటూ కూర్చోలేదు. తన దృఢ సంకల్పం, ఆత్మవిశాసం ముందు వైకల్యం ఓడిపోయింది. ఆమెకు రెండు చేతులు లేకపోయినా గెలిచింది.
jessica-cox
అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జెస్సికాకు పుట్టినప్పటి నుంచే రెండు చేతులు లేవు. బాల్యంలో కొన్నాళ్లు కృత్రిమ చేతులు ఉపయోగించింది. జెస్సికాకు 14ఏండ్లు దాటిన తర్వాత కృత్రిమ చేతులు తీసేసి, అన్ని పనులు తన కాళ్లతోనే చేయడం మొదలు పెట్టింది. 2005లో ఆరిజోనా యూనివర్సిటీలో మానసికశాస్త్రంలో డిగ్రీ చేసింది. తరువాత 22 ఏండ్ల వయసులో ఏకంగా విమానం నడిపేందుకు సిద్ధమైంది. పైలెట్‌గా శిక్షణ పొంది అతి తక్కువ సమయంలోనే విమానం నడపడం నేర్చుకున్నది. మూడేండ్ల శిక్షణ పూర్తి చేసుకుని పైలెట్ లైసెన్స్ కూడా పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె భోజనం చేయడం దగ్గర నుంచి రాయడం వరకూ అన్ని పనులు కాళ్లతోనే చేస్తుంది. ఆటలు కూడా ఆమె కాళ్లతోనే ఆడుతుంది. అన్ని అవయవాలున్న వారికే సాధ్యం కానీ ఆటలను అతి తక్కువ సమయంలోనే నేర్చుకుని తానేమీ తక్కువ కాదని నిరూపించింది. గుర్రపు స్వారీ, సర్పింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడల్లోనూ ప్రావీణ్యం సంపాదించి అబ్బురపరిచింది. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే రెండు చేతుల్లేకుండా విమానం నడిపిన తొలి మహిళగా జెస్సికా కాక్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. కాళ్లతో విమానాన్ని నడిపిన వనితగా ఆమెను గుర్తించిన పలు సంస్థలు అనేక బిరుదులు, పురస్కారాలను ప్రకటిస్తున్నాయి. ఇంకా గిన్నిస్ రికార్డులను బద్దలు కొడుతూ నేటి తరానికే ఆదర్శంగా నిలుస్తున్నది ఆమె.

326
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles