తల్లిదండ్రుల పంట పండించింది


Mon,April 22, 2019 12:38 AM

ఇంజినీరింగ్ చదివింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించింది. కానీ.. ఏదో వెలితి. సాఫ్ట్‌వేర్‌కు బైబై చెప్పి.. తండ్రి కోసం తోట పని చేయడం మొదలుపెట్టింది!
jots
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా లోన్‌వాడి గ్రామానికి చెందిన అమ్మాయి జ్యోత్స్న. తల్లిదండ్రులు లత, విజయ్. ఇద్దరూ వ్యవసాయం చేస్తారు. ఇంటి దగ్గర తోటలో కూరగాయలు, ద్రాక్ష పండిస్తారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయ వాతావరణంలోనే పెరిగింది జ్యోత్స్న. ఒకరోజు వ్యవసాయ పనుల్లో జరిగిన ప్రమాదంలో తండ్రి కాళ్లను కోల్పోయాడు. ఇది జ్యోత్స్నను తీవ్రంగా కలిచివేసింది. వీల్‌చెయిర్‌తో తండ్రి తోటకు వెళ్తుంటే ఆయనతోపాటు వెళ్లేది. అలా రోజులు గడిచే కొద్ది తండ్రికి తోటలో సాయం చేయడం ప్రారంభించింది. ఆయన చెప్పిన సూచనల ప్రకారం తోటపనులు చేసేది. ఇలా స్కూల్, కాలేజీకి హాజరవుతూనే ఉదయం, సాయత్రం తోట పనుల్లోనే గడిపేది. కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసిన ఆమెకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగం లభించింది. ఉద్యోగానికి వెళ్లిన ఆమె మనసు మాత్రం తండ్రి మీద, తోట మీదనే ఉండేది. ఆఫీస్ అయిపోయాక వచ్చి తోటలో పనులు చేసిది. ఇలా కుదిరినప్పుడు కాకుండా మొత్తం తోటలనే ఉండాలన్నది ఆమె అభిప్రాయం. ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామ చేసింది. ఇప్పుడు పూర్తిగా తోట సంరక్షణకు పరిమితం అయింది. మరోవైపు స్థానిక పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా చేరి డబ్బులు సంపాధిస్తుంది. ఇలా జ్యోత్స్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కూరగాయల, ద్రాక్ష పండ్ల తోటను దగ్గరుండి చూసుకుంటుంది.

1325
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles