ప్రపంచం మెచ్చే అవార్డుకు..భారతీయ మహిళా శాస్త్రవేత్త!


Sun,April 21, 2019 12:42 AM

ప్రపంచం మెచ్చే అవార్డుకు ఎంపికయ్యారు భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఈ అత్యున్నత పురస్కారం అందుకోబోతున్న మొదటి మహిళ కూడా ఆమె. ఏంటా అవార్డు? ఎవరా శాస్త్రవేత్త?
Gagandeep-Kang
గగన్‌దీప్ కంగ్ రాయల్ సొసైటీ ఫెలోషిప్ అందుకోబోతున్న తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా రికార్డు సృష్టించారు. జీవ శాస్త్రవేత్త అయిన గగన్‌దీప్ బ్రిటన్ ప్రధాన శాస్త్రీయ అకాడమీ ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం హర్యానాలోని ఫరీదాబాద్ ట్రాన్స్‌నేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(టీహెచ్‌సీటీఐ)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డుల విభాగంలో ఇదే అత్యున్నతమైనది. దాన్ని ఒక భారతీయ మహిళ అందుకోవడం విశేషం. భారతదేశంలో ఉన్న టాప్ సైంటిస్టుల లిస్ట్‌లో గగన్‌దీప్ కూడా ఉన్నారు. ముఖ్యంగా పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, టీకాల పరీక్షలు వంటి అంశాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ప్రయోగాలు జరిపారు. రోటా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న అతితక్కువ మంది శాస్త్రవేత్తల్లో గగన్‌దీప్ ఒకరు. ఈ రంగంలో మహిళలు తక్కువ ఉన్నారన్న విషయాన్ని గగన్‌దీప్ వ్యతిరేకించేవారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని తన విజయంతో మరోసారి రుజువైందని చెప్తున్నారు. మహిళా శాస్త్రవేత్తల సంఖ్యను పెంచడానికి తను తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరిశోధన రంగంలో పురుషులతో సమానంగా మహిళల సంఖ్య కూడా సమానం చేయడమే లక్ష్యమని అంటున్నారు.

302
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles