దునియాలోనే ఖరీదైన కార్లు!


Thu,April 18, 2019 12:02 AM

కాలి నడకన వెళ్లేవారికి సైకిల్‌ కొనాలనుంటుంది. సైకిల్‌ మీద వెళ్లే వారికి బైక్‌ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బైక్‌పై వెళ్లే మధ్యతరగతి వారికి కారు ఉంటే భలే ఉంటుందనిపిస్తుంది. ఇక కోటీశ్వరుడి హోదా, హుందాతనం తాను వాడే వస్తువులు, వాహనాల్లో కనిపిస్తుంది. అందుకే కోటీశ్వరుల కోసమే కొన్ని కార్లు తయారు చేస్తున్నారు. వాటిల్లో టాప్‌-5 కార్ల గురించి ఈ వారం విశేషలో తెలుసుకుందాం.బ్రాండ్‌ను బట్టి చాక్లెట్‌ రుచి మారినట్టే.. కార్ల బ్రాండ్లలోనూ ఖరీదును బట్టి ఆయా ఫీచర్లు ఉంటాయి. ఇంత ఖరీదైన కార్లను ఆషామాషీగా తయారు చేయరండోయ్‌. వీటిని ఎవరికి అమ్మాలో తెలుసుకొని వారి జాబితా సిద్ధం చేసిమరీ అమ్ముతుంటాయి కొన్ని కంపెనీలు. మరికొన్ని అదనపు ఫీచర్లు, కొత్త హంగులతో కార్లను రూపొందిస్తూ.. కోటీశ్వరులను ఆకట్టుకుంటాయి. ఇలా కొనుగోలు చేసిన పలు రకాల కార్ల కలెక్షన్‌ గురించి ఓ ఆటోమొబైల్‌ సంస్థ సర్వే చేసింది. వీటిల్లో అత్యంత ఖరీదైన రోల్స్‌ రాయ్స్‌ నుంచి బుగట్టి చిరోన్‌ వంటివి ఉన్నాయి.

1 రోల్స్‌ రాయ్స్‌

rolls-royce
ఖరీదైన కార్ల బ్రాండ్‌ అనగానే వినబడే పేరు రోల్స్‌ రాయ్స్‌. బ్రిటిష్‌ లగ్జరీ ఆటోమొబైల్‌ తయారీ సంస్థకు చెందిన బ్రాండ్‌ ఇది. 1907లో కారును రూపొందించి యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యు.కె)కు చెందిన స్కాట్‌ ల్యాండ్‌లో మొదటి వాహనాన్ని నడిపారు. విమానాల ఇంజన్లను 1914లోనే ఈ సంస్థ మొదలు పెట్టింది. రోల్స్‌ రాయ్స్‌ రూపొందించిన ‘ఎయిరో ఇంజిన్‌'ను 1919లో తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోల్స్‌ రాయ్స్‌ రూపొందించిన కార్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్నది. ‘రోల్స్‌ రాయ్స్‌ స్వెప్‌టైల్స్‌' పేరుతో 2017లో ఈ సంస్థ ఓ కారును రూపొందించింది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. దీని హార్స్‌ పవర్‌ 6.75 ఎల్‌వీ 12. ధర 90 కోట్ల 20 లక్షలు. ఈ రకం కార్లను ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు వేలు మాత్రమే ఉత్పత్తి చేసింది. అద్భుతమైన ఇంటీరియర్‌తో బాగా ఆకట్టుకుంటుంది

2 ల్యాంబొర్ఘిని వెనెనోరాయ్స్‌

LAMBORGHINI
ఇటలీకిచెంది స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ ల్యాంబొర్ఘిని. 2013లో కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా ‘ల్యాంబొర్ఘిని వెనెనో’ పేరుతో ఈ కారును ప్రవేశపెట్టింది. జనీవాలో జరిగిన మోటార్‌ షోలో అందరి దృష్టినీ ఆకట్టుకున్నది. దీని హార్స్‌ పవర్‌ 740, గంటకు 221 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ధర రూ.30 కోట్ల పైమాటే.

3కొయినిగ్సెగ్‌ సిసిఎక్స్‌ ట్రెవిటా

KOENIGSEGG-CCXR-TREVITA
ఇది స్వీడిష్‌కు చెందిన కంపెనీ. స్పోర్ట్‌ కార్‌ విభాగానికి చెందిన ఈ సంస్థ 2006లో లగ్జరీ కార్ల ను తయారీ మొదలు పెట్టింది. డైమండ్‌ డస్ట్‌ తోపాటు కార్బన్‌, ఫైబర్‌లతో కొయినిగ్సెగ్‌ సీసీఎక్స్‌ ట్రెవిటాను రూపొందించారు. రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. ఆకర్షణీయమైన ఇంటీరియర్‌తో తెలుపు, నలుపు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 100హార్స్‌ పవర్‌తో గంటకు 254 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. శ్వేతజాతీయులైన ముగ్గురు డిజైనర్లు రూపొందించడంతో దీనిని ‘ట్రెవిటా’ అని పిలుస్తున్నారు. దీని ధర దాదాపు 30 కోట్లు.

4మెక్‌లారెన్‌ ప్లస్‌1

mclaren
ప్రముఖ బ్రిటిష్‌ సూపర్‌ కార్‌ కంపెనీ మెక్‌లారెన్‌. ఇది ‘మెక్‌లారెన్‌ ప్లస్‌1 జీటీఆర్‌' పేరుతో ఈ కారును ప్రవేశపెట్టింది. ఇది ఆల్ట్రా ఎక్స్‌క్లూజివ్‌ వెహికల్‌. ఈ కారును అమెరికా, జపాన్‌, యునైటెడ్‌ నేషన్స్‌ కింగ్‌ డమ్‌(యు కె)ల్లోని ఎంపిక చేసిన వినియోగాదారులకే విక్రయించారు. ఫార్ములా వన్‌ వంటి అనేక కార్ల నుంచి స్ఫూర్తి పొంది దీనిని తయారు చేశారు. ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌తో పాటు, పెట్రోల్‌తో నడిచేలా దీన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. దీని హార్స్‌ పవర్‌ 1000, స్పీడ్‌ 147, ధర దాదాపు. రూ. 40 కోట్లు.

5లికాన్‌ హైపర్‌ స్పోర్ట్‌

lykan_hypersport
అరబ్‌ ఎమిరైట్స్‌కు చెందిన ‘డబ్ల్యూ మోటార్స్‌' సంస్థ ‘లికాన్‌ హైపర్‌ స్పోర్ట్‌'ను రూపొందించింది. ఇది స్పోర్ట్స్‌ విభాగానికి సంబంధించిన కారు. 2013లో ఖతార్‌ మోటార్‌ షోలో ఈ కారును ప్రదర్శించారు. ఈ కారు హెడ్‌ లైట్లను రూపొందించేందుకు డైమండ్లను ఉపయోగించారు. అబుదాబీ పోలీసులు విధుల్లో ఉపయోగించే వాహనాల నమూనా ద్వారా దీనిని తయారు చేశారు. ధర రూ. 23 కోట్ల 29 లక్షలు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రికల్‌ చార్జింగ్‌తో నడుస్తుంది. దీని హార్స్‌ పవర్‌ 780.

706
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles