పెండ్లికి వింత బహుమతి!


Wed,April 17, 2019 11:56 PM

స్నేహితులు, బంధువుల పెండ్లికి వెళ్లేటప్పుడు వధూవరులకు బహుమతులు ఇస్తుంటారు. అటువంటి బహుమతుల జాబితాలో దుస్తులు, ఫొటో ప్రేములు, గడియారాలు, ఉంగరాలు, ఇతర ఆభరణాలుంటాయి. అయితే.. బెంగాలీ సంప్రదాయంలో మాత్రం పెండ్లికి ఓ వింత బహుమతిని కచ్చితంగా ఇస్తుంటారు. అదేంటో తెలుసా?
Auspiciousness
బెంగాలీలకు చేపలంటే ఎంతో ఇష్టం. తమ సంస్కృతి, సంప్రదాయాల్లో చేపలకు పెద్ద పీటవేస్తారు. అందుకోసమే బెంగాలీ పెండ్లిళ్లలో చేపలను ‘జల పుష్పాల’ పేరుతో కానుకలుగా నూతన వధూవరులకు ఇస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఈ వింతైన ఆచారం ఉన్నది. పెండ్లికి ముందు వధూవరుల కుటుంబాలు ఒకచోట చేరి ‘ఐబురో బాత్‌' అనే కార్యక్రమం చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో చేపలతో చేసిన వంటకాలే ప్రధానంగా ఉంటాయి. వీటిలో మచ్చర్జోల్‌, ఖోషామంగోషో, షుక్తో వంటి వంటకాలనే ఆరగిస్తుంటారు. ఆ తర్వాత పసుపు రాసుకునే కార్యక్రమానికి వధువు ఇంటికి తత్వా అనే కానుకల బుట్టను తీసుకొస్తాడు వరుడు. ఇందులో విశేషమేమిటంటే... చేపని అందంగా పెండ్లికూతురు దుస్తులతో ముస్తాబు చేసి తెస్తారు. అందమైన మెరుపుల చీరకట్టి, ముక్కుకు ముక్కెర, బొట్టూ, సింధూరం పెట్టి లిప్‌స్టిక్‌ కూడా రాస్తారు. ఆడపిల్ల వారి తరపున కూడా ఓ చేపను పెండ్లికుమారుని వలె అలంకరించి వరుని ఇంటికి తీసుకువస్తారు. ఈ చేప కానుకను ఇచ్చిపుచ్చుకున్న తర్వాతే పెండ్లి తంతు ప్రారంభమవుతుంది.

233
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles