నవజాత శిశువుల కోసం మిల్క్ బ్యాంక్


Thu,April 18, 2019 01:31 AM

నవజాత శిశువుల ఎదుగుదలకు తల్లి పాలు శ్రేయస్కరం. కొన్ని సందర్భాల్లో తల్లి తన బిడ్డకు పాలను పట్టే అవకాశం ఉండదు. అలాంటప్పుడు శిశువుకు పోషకాలు అందవు. అలాంటి నవజాత శిశువులకు ముర్రు పాలు అందించాలనే ప్రయత్నం చేశారు లక్నో మెడికల్ కళాశాల విద్యార్థులు.
milk-bank
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కింగ్ జార్జ్ మెడికల్ కళాశాల విద్యార్థులు ది హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను మార్చిలో ప్రారంభించారు. పాలు అందక పురిట్లోనే మరణావస్థను ఎదుర్కొంటున్న నవజాత శిశువులకు వీరు ప్రాణం పోస్తున్నారు. అయితే ఈ మిల్క్ బ్యాంక్‌లో ముర్రుపాలను భద్రపరచడం, అవసరమైన వారికి అందిండం నిత్యం జరుగుతున్నది. తల్లి ఐసీయూలో ఉండి శిశువుకు పాలు అందించలేని స్థితిలో ఉండాలి. అప్పుడే ఈ మిల్క్ బ్యాంకు ద్వారా నవజాత శిశువులకు పాలు అందిస్తున్నాం. ఈ సేవ పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నాం అంటున్నారు మిల్క్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శీతల్ వర్మ. ఆ కళాశాల విద్యార్థినులు తల్లుల నుంచే పాలను సేకరిస్తున్నారు. అవి సరిపోని పరిస్థితుల్లో నాణ్యమైన ఆవుపాలను సేకరించి నవజాత శిశువులకు అవసరమయ్యేలా తయారు చేసి పట్టిస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంకుకు స్వచ్ఛందంగా పాలను అందించేందుకు తల్లులు ముందుకు వస్తున్నారు.

136
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles