కూలర్ వాడుతున్నారా?


Thu,April 18, 2019 01:28 AM

ఇప్పుడు అందరి ఇండ్లల్లో కూలర్లు వినియోగించడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇండ్లల్లో కూలర్ తప్పనిసరైంది. కూలర్ ఎక్కువకాలం మన్నాలన్నా.. గాలి బాగా రావాలన్నా ఈ చిట్కాలు పాటించాల్సిందే!
cooler
-చాలామంది గంటో రెండు గంటల తర్వాతనో కూలర్ అపేద్దాం అని నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేకపోతే పంప్ మోటర్ పాడైపోతుంది. ఎప్పుడూ నీళ్లు ఎక్కువగానే ఉండేటట్లు చూసుకోవాలి.
-కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలపై చిమ్మి.. అవి పాడైపోయే అవకాశం ఉన్నది. చాలామంది కూలర్ బటన్ ఆఫ్ చేసినప్పటికీ ప్లగ్‌ను తీయడం మరుస్తారు. నీటిలో ఉంటుంది కాబట్టి ఎర్త్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
-ఎయిర్‌కూలర్లను రెగ్యులర్‌గా వాడుతున్నప్పటికీ కనీసం వారంరోజులకోసారి ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా తీసేయాలి. డిటర్జెంట్‌తో కడిగి శుభ్రం చేసుకోవాలి. తద్వారా నీటిలో ప్రమాదకర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపడం వల్ల దుర్వాసన కూడా రాదు.
-కూలర్లలో కూలింగ్ ప్యాడ్‌లు పూర్తిగా తడుస్తున్నాయా లేదా చూసుకోవాలి. కూలింగ్ ప్యాడ్లు పూర్తిగా తడవకపోయినా, వాటి మధ్య ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నా గాలి చల్లగా రాదు. పైన కూలర్ రంధ్రాల్లో చెత్త ఇరుక్కుపోయినా ప్యాడ్స్ తడవవు. రంధ్రాల్లో చెత్తలేకుండా చూడాలి.

229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles