ప్రపోజల్లందు.. ఈ-ప్రపోజల్ వేరయా!


Mon,April 15, 2019 11:48 PM

నచ్చిన అమ్మాయిని పెండ్లికి ఒప్పించడానికి చాలా రకాల ప్రపోజ్‌లు ఉంటాయి. వీటిలో కొన్ని విఫలమవుతాయి. కొన్ని సఫలమవుతుంటాయి. ఇలా కాకూడదని ఓ యువకుడు పక్కాగా ప్రపోజ్ చేశాడు. అందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రపోజల్‌కు, ప్రయాణానికి సంబంధం ఏంటనుకుంటున్నారా?
google
జపాన్‌కు చెందిన యసుసీ యస్సన్ తకహషీ పెద్ద పనే పెట్టుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి కొత్తగా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఇప్పటి వరకూ చాలామంది చాలా విధాలుగా వారి సోల్‌మేట్స్‌కు లవ్ ప్రపోజ్ చేసుంటారు. వారందరికన్నా భిన్నంగా ఇతను టెక్నాలజీని వాడుకున్నాడు. అదెలాగో తెలుసా.. సాధారణంగా గూగుల్ మ్యాప్‌లో మార్గాలను చూసి ప్రయాణం చేస్తుంటారు. అదే విధంగా ఇందులో తెలిసిన మార్గాలను రూపొందించే సదుపాయం కూడా ఉంది. ప్రయాణించిన మార్గం టైమ్‌లైన్‌లో రికార్డు అవుతుంది. వీటి ఆధారంగా యసుకీ మ్యాప్‌లో Marry Me (నన్ను పెండ్లి చేసుకో) అనే అక్షరాలు కనిపించేందుకు ఏకంగా రెండు దీవులనే చుట్టేశాడు. తన వద్ద ఉన్న జీపీఎస్ వ్యవస్థతో హొక్కయిదో తీర ప్రాంతం నుంచి మొదలైన అతని ప్రయాణం ఆరు నెలలపాటు సాగింది. M అనే అక్షరంలా ప్రయాణం మొదలుపెట్టి కగోషిమా దీవిలో లవ్ సింబల్ రూపొందించే వరకు అతడి ప్రయాణం కొనసాగింది. అలా 7163 కి.మీ. ప్రయాణించి గూగుల్ మ్యాప్‌లో Marry Me అక్షరాలను ఆవిష్కరించాడు. యసుసీ ప్రయాణం చేసిన మార్గం చూసిన అమ్మాయి నట్టుకీ ఆశ్చర్యపోయింది. ఇంతకంటే అద్భుతంగా మరెవ్వరూ ప్రపోజ్ చేయలేరంటూ యసుసీతో పెండ్లికి అంగీకరించింది. గూగుల్ ఎర్త్, గూగుల్ స్ట్రీట్ వ్యూ రూపకల్పనలో పదేండ్ల అనుభవం ఉన్న యసుసీ.. ఆ అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడిందంటున్నాడు. సోషల్ మీడియాలో యసుసీని తెగ పొగిడేస్తున్నారు. ఈ ప్రపోజల్ త్వరలో గిన్నిస్ రికార్డుల్లో స్థానం పొందనున్నది.

341
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles