శుభ్రతతోనే ఆరోగ్యం


Mon,April 15, 2019 11:48 PM

kitchen
-వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం అందుబాటులో స్పాంజ్ లేదా టవల్‌ను ఉపయోగించుకోవాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చెత్తబుట్టను ఏర్పాటు చేసుకోవాలి.
-నిత్యంవాడే పాత్రలను పెద్దపెద్ద కబోర్డుల్లో ముందుగానే అమర్చి పెట్టుకోవాలి. ఇంటికి అతిథులొస్తే వాడే పాత్రలను కబోర్డుల్లో వెనుక పక్కగా అందంగా అమర్చుకోవాలి. పేపర్ ప్లేట్లు, స్టీలు ప్లేట్లు సెల్ఫ్‌లో చేతికందే లా పెట్టుకోవాలి. రోజూ అవసరమయ్యే వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి.
-ఏ డబ్బాలో ఏమున్నాయో చూడగానే తెలిసేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది. డబ్బాలకు ముందర లేబుల్ రాసి అంటిస్తే త్వరగా గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇలా చేస్తే వంట పని త్వరగా అయిపోతుంది.
-వంటకు కావాల్సిన కూరగాయలన్నీ ఒకేసారి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకోవడం వల్ల పదే పదే ఫ్రిజ్ డోర్ తీయాల్సిన పని తప్పుతుంది. కిచెన్‌లో ఖాళీ లేదని పొడి వస్తువులను (ఉప్పు, కారం) ఇతర డబ్బాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు.
-వంటగదిలో వాడే డస్టర్ (స్పాంజ్ లేదా టవల్)ను చాలా రోజుల వరకు వాడుతుంటారు. దీనివల్ల లెక్కలేనన్ని సూక్ష్మక్రీములు వాటిలో చేరతాయి. వీటిని ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం దరిచేరదు.

176
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles