బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా?


Mon,April 15, 2019 11:46 PM

beauty-parlour
-బ్యూటీపార్లర్‌లో ఏదైనా కాస్మొటిక్ పదార్థాన్ని మీ చర్మానికి ఉపయోగించేటప్పుడు అందులో ఏవైనా హానికరమైన రసాయనాలున్నాయేమో చూడండి. వాటిని వాడే ముందు ఎక్స్‌పైరీ డేట్ తదితర వివరాలను అడిగి మరీ తెలుసుకోండి.
-మీరు వెళ్లే పార్లర్ నిర్వాహకులు శుభ్రతను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించండి. సౌందర్యంతో పాటు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అనుభవజ్ఞులైన బ్యూటీషియన్లేనా అనేది పూర్తిగా తెలుసుకుని మరీ వెళ్లండి.
-మీకు ఎలాంటి అలర్జీ లేదా ఇతర చర్మవ్యాధులుంటే ప్రత్యేకంగా మీరు వాడే తువాలు, దువ్వెన తదితర వస్తువులను వెంట తీసుకెళ్లండి. మీరు తీసుకెళ్లిన వాటినే ఉపయోగించి వాటితోనే మీ ముఖారవిందాన్ని మరింతగా ఇనుమడింపజేసుకోవచ్చు.
-కొందరు కనీస పరిజ్ఞానం లేకుండా సొంతగా ఇంటివద్దే అందం కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం తప్పు కాదు కానీ సరైన అవగాహన కచ్చితంగా అవసరం. ఐలైనర్ తయారు చేసుకోవాలన్నా.. ఫేషియల్ చేసుకోవాలన్నా కొంత వాటిపట్ల అవగాహన ఉండాలి.
-నిద్రించే ముందు మేకప్ అలాగే ఉంచితే అందులోని కెమికల్, గ్రీజు చర్మ రంధ్రాల్ని మూసివేస్తాయి. తరచూ మొటిమల సమస్య ఏర్పడుతుంది. అందుకని కచ్చితంగా మేకప్ తొలిగించాకే నిద్రపోండి.

163
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles