టెక్నాలజీ రంగంలో దూసుకెళ్తున్న అశ్విని అశోకన్


Mon,April 15, 2019 01:08 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) కంపెనీ మ్యాడ్ స్ట్రీట్ డెన్ ఏర్పాటు చేసేందుకు సిలికాన్ వ్యాలీని వదిలి ఇండియాకు వచ్చారీమె. వినియోగదారుడికి ఉపయోగపడేలా టెక్నాలజీని ల్యాబ్‌లో డెవలప్ చేసే స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టారు. నేను సింగిల్ లైన్ కోడ్ రాయలేను. అది రాకపోతేనేం మిగతా చాలా పనులు చేయగలను. అది మా నాన్న నింపిన స్ఫూర్తి అంటారామె. నిజానికి టెక్నాలజీ రంగం మహిళలకు అనుకూలంగా రూపొందించకపోవడం వల్లే ఈ రంగంలో మహిళల సంఖ్య తక్కువ అంటున్న మ్యాడ్ స్ట్రీట్ డెన్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ సహవ్యవస్థాపకురాలు అశ్విని అశోకన్ సక్సెస్‌మంత్ర ఇది.


అశ్విని స్వస్థలం చెన్నయ్. ఆమె కళాకారిణి. నృత్యం, సంగీతాలలో శిక్షణ పొందింది. పద్నాలుగేండ్ల వయసునుంచి 21 యేళ్లు వచ్చేవరకు ఇండియా అంతటా దర్శనలిచ్చింది. కళాకారిణిని కావడం వల్ల రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లడం కుదిరేది కాదు. అయినప్పటికీ ఆమె తండ్రి ఆమెతో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేయించారు.


Ashwani
ఇంటరాక్షన్ డిజైన్ అంటే డిజిటల్ పరికరాలను.. సిస్టమ్స్, సర్వీసులను హ్యూమన్ కమ్యూనికేషన్, ట్రాన్సాక్షన్లకు తగ్గట్టుగా రూపొందించడం. ఆ కోర్సులో భాగంగానే రోబోస్, ఇతర డిజిటల్ ఏజెంట్స్ కదలికలను డిజైన్ చేసేందుకు నృత్యరీతులు ఎలా ఉపయోగపడతాయనే అంశం మీద థీసిస్ సమర్పించింది అశ్విని. అలా ఆమె జీవితం నృత్యం, సంగీతం, డిజైన్, కంప్యూటర్స్, ప్రజలు, సంస్కృతులతో పెనవేసుకుపోయింది. నేను ఈ రోజున ఈ స్థాయికి చేరుకోగలిగానంటే అందుకు కారణం మా నాన్నేఅంటుంది అశ్విని.

ఇంటెల్‌లో పనిచేయడం..

ఇంటెల్‌లో పనిచేసినప్పుడు డాక్టర్ జెనివివె బెల్ అనే ఆంత్రోపాలజిస్ట్ మా బాస్. ఆయన యూఎక్స్ ఆర్గనైజేషన్ తరపున స్మార్ట్ హోం బిజినెస్ కోసం ఒక టీం తయారుచేశారు. అందులో నేనూ ఉన్నాను. అది నాకో పాఠంలా ఉపయోగపడింది. ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన పనిచేశాను. ఆ క్రమంలో టెక్నాలజీని అర్థవంతంగా వాడడం తెలిసింది. సాంకేతిక పరిశోధన, అభివృద్ధి అనేవి మనుషుల జీవితాలను ఎలా నడిపిస్తాయో నేర్పించింది. అక్కడ మొబైల్ రీసెర్చ్ ల్యాబ్‌లో పనిచేశాను. అప్పుడు మెషీన్ లెర్నింగ్, ఇమేజ్ రికగ్నైజేషన్, సెన్సర్స్, కాంటెక్ట్సువల్ కంప్యూటింగ్ వంటివాటి గురించి పనిచేస్తున్నప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పట్ల ఆసక్తి కలిగింది. ముఖ్యంగా సాంకేతికతను ప్రపంచ ప్రజలకి అర్థవంతంగా ఎలా చెప్పొచ్చు అనే విషయం అవగతమైంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్కెట్‌ను మనుషులు, ప్రదేశాలు, వ్యవస్థలో ఉన్న కథలు, భావోద్వేగాలు, అలవాట్లుగా ఎలా చూడాలో తెలుసుకున్నాను అంటున్న అశ్విని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్పు అనేది ఎప్పటికప్పుడు స్థిరంగా జరుగుతుండాలి, అలాగే నేర్చుకోవడం కూడా నిరంతరం జరుగాలంటారు.

Ashwini1

పెండ్లి తర్వాత..

ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ) కంపెనీ హెడ్, న్యూరోసైంటిస్టు అయిన ఆనంద చంద్రశేఖరను పెండ్లి చేసుకున్నది అశ్విని. వారూ పగలు, రాత్రి తేడా లేకుండా ఎఐ గురించి మాట్లాడుకునేవాళ్లట. భవిష్యత్తులో టెక్నాలజీని ప్రజలకు ఎలా అనుసంధానం చేయొచ్చనే విషయాలే వారి మధ్య జరిగే సంభాషణల్లో ఉండేవి. ఆయనను కానీ పెండ్లి చేసుకోకపోతే ఈ పని చేసేదాన్ని కాదు. మా ఇద్దరి భాగస్వామ్యంలో మ్యాడ్ స్ట్రీట్ డెన్‌ను ఏర్పాటుచేశాం అంటారు ఆశ్విని. ఒక వ్యాపారవేత్త కావాలంటే ప్రజలు, ప్రదేశం, వ్యవస్థ, భావోద్వేగాలు, అలవాట్లు - వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మనం చేసే ప్రొడక్ట్ ఎక్కడికి చేరాలి, ఎవరికి చేరాలనే విషయాల పట్ల సరైన అవగాహన ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్ జీవితంలో మార్పులు జరుగడమనేది సర్వసాధారణం. అందుకని ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూ, నేర్చుకుంటూ ఉండాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రత్యేకంగా ఉండాల్సిన మరో క్వాలిటీ సహానుభూతి అంటారు అశ్విని.

అనుకూలంగా లేకపోవడమే..

టెక్నాలజీ రంగంలో మహిళలు ఎక్కువగా లేకపోవడానికి కారణం ఆ రంగం మహిళలకు అనుకూలంగా లేకపోవడమే అంటారు అశ్విని. మహిళలు ఈ రంగంలోకి రావాలనుకునే టెక్నాలజీలో పట్టాభద్రులయ్యి ఉద్యోగాల్లో చేరుతున్నారు. అయితే పెండ్లి, సంసారం, పిల్లలు, బంధాల పేరుతో తక్కువ సమయంలోనే వారు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. అయితే ఇది ఆడవాళ్ల సమస్య కాదు. ఇది వ్యవస్థ సమస్య అంటారామె. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రాథమిక సదుపాయాలు మహిళలకు అనుకూలంగా ఉండాలి. టెక్నాలజీ రంగమంతా మగవారికి అనుకూలంగా ఉందని, పూస్‌బాల్ టేబుల్స్, కేఫ్స్ ఇలా అన్ని వారికే అనుకూలంగా ఉన్నాయి. అంతేకాని ఆడవాళ్లకు ఉపయోగపడేలా నర్సింగ్ రూములు, చైల్డ్ కేర్ సెంటర్లు ఉండవు. ఉన్నా ఏ ఒక్కటో రెండో అంటారు. అవి పెరుగాలనే డిమాండ్ పెరిగితే అన్నీ సమకూరుతాయంటారామె. తరాల తరబడి ఉన్న అసమానతలు తొలిగిపోవాలంటే ప్రశ్నించాలి. కావాల్సిన వాటిని గట్టిగా అడగాలి అప్పుడే మార్పు వస్తుందంటారు అశ్విని.

మార్పు కోసం..

ఆడవారు పనిచేసే ప్రాంతాల్లో మార్పు రావాలన్నది అశ్విని ఉద్దేశం. పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకంగా గది కావాలని అడగాలి. టెక్ కాన్ఫరెన్స్ రూముల్లో చైల్డ్‌కేర్ సెక్షన్ కావాలని అడగాలి. ఈవెంట్లను పగటి సమయంలో ఏర్పాటు చేయమని చెప్పాలి. అప్పుడే టెక్నాలజీ రంగంలో మార్పు వస్తుంది. మహిళల భాగస్వామ్యం పెరుగుతుందని అశ్విని అంటారు.

నా పేరు ఉండేలా పనిచేస్తాను


Ashwini2
టెక్నాలజీ రంగంలో ఏదో ఒకరోజున టాప్ ఎంటర్‌ప్రెన్యూర్స్ జాబితాలో నా పేరు ఉండేలా పనిచేస్తాను. అంతేకాదు మహిళ అని, మైనారిటీ అని మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లను అనడాన్ని ఒప్పుకోను. నా హక్కుల కోసం డిమాండ్ చేస్తూనే నా పనితీరును మెరుగు పరుచుకుంటాను. ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేశాను. ఆ దిశగా నా ప్రయాణం ఇంకా ఎంతో ఉంది. భవిష్యత్తులో లింగబేధాన్ని బట్టి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ అంటూ ప్రత్యేకంగా పిలిచే కేటగిరీకి చెక్ పెట్టి ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేలా ఎదగాలన్నదే నా ఆకాంక్ష అంటారు అశ్విని అశోకన్.

826
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles