పుట్టగొడగుల సాగులో నమ్రత


Sun,March 24, 2019 01:06 AM

చిన్న టెర్రాస్ మీద కుటుంబానికి సరిపడా కూరగాయాలు పండించేది. క్రమంగా ఆ ఆలోచనలు వ్యాపారం వైపు సాగాయి. కూరగాయల స్థానంలో పుట్టగొడుగులు వచ్చాయి. వ్యాపారం విస్తరించింది. ఆ పుట్టగొడుగుల్లోనే వేర్వేరు జాతులను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో పుట్టగొడుగులు పండిస్తూ, వ్యాపారంలో నిమగ్నమైంది బెంగళూర్‌కు చెందిన నమ్రత గొయాంక..
namratha
ఆమె కుమారునికి పౌష్టికమైన ఆహారం అందించాలన్న ఆలోచనతో పుట్టగొడుగులను పండించింది. వాటికి మంచి స్పందన రావటంతో అదే వ్యాపారంగా చేసుకొని ముందుకు సాగుతున్నది. బెంగళూర్‌లో నివాసం ఉంటున్న నమ్రత గొయాంకా కొంత కాలంగా మూడు రకాల పుట్టగొడుగులను పండిస్తున్నది. కోల్‌కత్తాకు చెందిన నమ్రతా పద్దెనిమిదేండ్లప్పుడు చదువు కోసం బెంగళూర్‌కు వచ్చింది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి, బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ చేసింది. పెండ్లి తర్వాత లా విద్యను అభ్యసించింది. 2014లో బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు పౌష్టికాహారం కచ్చితంగా ఇవాలని నిర్ణయించుకుంది నమ్రత. టెర్రాస్‌పైన ఆకుకూరలు, టమాలు, బీన్స్ పండించింది. ఆ సమయంలోనే వ్యాపారాన్ని చేయాలనుకుంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వస్తువును వెతుకులాడింది. పుట్టగొడుగులకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుంది. మొదట పుట్టగొడుగుల విత్తనాలను విక్రయించడం ప్రారంభించింది. అలా కాకుండా వాటిని పండించి విక్రయిస్తే ప్రజలకు పౌష్టిక ఆహార పదార్థాన్నీ ఇచ్చినట్టువుతుందని వాటిని పండించాలనుకుంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ హర్టికల్చర్ రీసెర్చ్‌లో కోర్సు చదివింది. పుట్టగొడుగుల సాగుపై పూర్తి అవగాహన పెంచుకొని మూడు రకాలను పండిస్తున్నది. వీటితో పాటు జాక్‌ఫ్రూట్, ఉసిరిని కూడా విక్రయిస్తూ పుట్టగొడుగుల వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నది నమ్రత.

531
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles