మెడ మెరవాలంటే..


Sun,March 24, 2019 01:01 AM

ముఖం అందంగా ఉంటేనే సరిపోదు. మెడ భాగం కూడా అందంగా ఉండాలి. కొందరికైతే ముఖం తెల్లగా ఉండి, మెడ నల్లగా ఉందని బాధపడుతుంటారు. అలాంటివారు ఈ టిప్స్ పాటించి చూడండి
neck
-ఆలుగడ్డలోని పోషక విలువలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. ఇది శరీర ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో అలాగే అందానికి కూడా ఉపయోగపడతాయి. ఆలు ముక్కలతో మర్దనా చేసుకుంటే చర్మం కాంతివంతమవుతుంది.
-ఆలుగడ్డని మెత్తని పేస్టులా చేసి అందులో కొద్దిగా వంటసోడా, ఉప్పు కలుపాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మెడభాగం తెల్లగా మారుతుంది.
-కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం, టమాట గుజ్జు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండు గంటల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మెడ భాగం రంగు కోల్పోకుండా ఉంటుంది.
-యాపిల్ సైడర్ వెనిగర్‌లోని విటమిన్స్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలిగిస్తాయి. ఈ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు, తేనె కలిగి అందులో దూదిని ముంచి మెడకు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మెడ భాగం మృదువుగా మారుతుంది.
-పాల మీగడలో కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే మెడ తెల్లగా మారుతుంది.
-నానబెట్టిన బాదం పప్పును మెత్తగా చేసి పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకోవాలి. గంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖం తెల్లగా మారుతుంది.

431
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles