ఆర్గానిక్ సాగులో ఆ గ్రామం ఆదర్శం


Sat,March 23, 2019 01:08 AM

సేంద్రియ పంటలు పండించి తమ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొంటున్నారు. అంతేకాదు ఉపాధి కూడా పొందుతూ ఆ గ్రామ పంచాయతీలోనిప్రజలంతా సమష్టిగా సేంద్రియ వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన వారు సైతం ఆ ఆదర్శ గ్రామం సాధించిన విజయాలపై అధ్యయనం చేసేందుకు క్యూ కడుతున్నారు.

organic
అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసుకుని తమ గ్రామాన్ని సేంద్రియ వ్యవసాయంలో ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకున్నారు కేరళకు చెందిన కంజికుజ్హి గ్రామ వాసులు. రాష్ట్రంలోనే అత్యంత మారుమూల గ్రామమైన కంజికుజ్హిలో రసాయనిక ఎరువులు ఉపయోగించకుండా తమ గ్రామ పంచాయతీకి సరిపడా కూరగాయలు పండించుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పంటలు పండించడానికి అనువుగా లేని ఇసుక, పొడిబారిన నేలల్లో సైతం సేంద్రియ ఉత్పత్తులు పండిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడి తమ గ్రామ ప్రజలకు కావల్సిన వనరులను సమకూర్చుకుంటున్నారు. 8,600 జనాభా ఉన్న కంజికుజ్హి గ్రామంలోని ప్రజలు తమకు సరిపడగా, అధనంగా మిగిలిన కూరగాయలను సమీపంలో ఉన్న కొచ్చి, కొట్టాయం, ఆలప్పుజా వంటి నగరాలకు తరలించి అమ్ముతూ ఉపాధి కూడా పొందుతున్నారు. 1995లో కంజికుజ్హి గ్రామ పంచాయతీలో నివసించే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలకు సరిపడా కూరగాయాలను తామే సేంద్రియ పద్ధతిలో పండించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సేంద్రియ విధానంలో కూరగాయల సాగు మొదలు పెట్టాలని కంజికుజ్హి గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎంజీ రాజు ఆదేశించాడు.

ఆయన ఆదేశాలను అందరూ పాటించి తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకోవడంలో ఆ గ్రామ వాసులంతా సహకరించుకున్నారు. నేల పంటలు పండించేందుకు అనువు కాకపోవడంతో జీవ వ్యర్థాల మిశ్రమంతో చేసిన ఒండ్రు మట్టిని ఉపయోగించి కూరగాయల సాగును మొదలు పెట్టారు. మొదటగా 60 కుటుంబాలకు చెందిన వారు సేంద్రియ కూరగాయలను పండించడం ప్రారంభించగా మంచి ఫలితాలు కనిపించాయి. సేంద్రియ సాగుపై అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్త డా.థామస్ ఇసాక్ సహకారంతో పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ పేరుతో అక్కడి నేలల్లో పంటలు ఏ విధంగా సాగు చేయవచ్చు. ఎటువంటి పంటలు పండించవచ్చు అనే అంశాలపై అందరికీ చైతన్యం కల్పించారు. ఎరుపు రంగు ఆకుల కూరలు, వంకాయ, దోసకాయ, క్యాబేజీ వంటి కూరగాయలు అక్కడి నేలల్లో పండించేందుకు అనువైనవిగా గుర్తించారు. విత్తనాలను రాయితీకి అందిస్తూ అవసరమైన ప్రోత్సాహాన్నిచ్చేందుకు బృందాలుగా విభజించి అవగాహన కల్పించారు. ఆ గ్రామం సాధించిన విజయాలపై అధ్యయనం చేసేందుకు పలు వ్యవసాయ కళాశాలలకు చెందిన విద్యార్థులతోపాటు, దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు క్యూ కడుతున్నారు.
organicc

892
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles