తల్లి చివరి సందేశం!


Sat,March 23, 2019 01:06 AM

ప్రతిఒక్కరి జీవితంలో మనసుకు దగ్గరైన వారు దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. వాళ్లు దూరమై చాలారోజులకు వారు పంపిన కానుకలు అందితే ఆ ఫీలింగ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అలాంటి అనుభవమే యూకేకి చెందిన మహిళకు ఎదురైంది. ఆ కానుకేంటో తెలుసా?
sandles
యూకేకి చెందిన ఎమ్మాకు అలాంటి అనుభవం ఎదురైనది. ఎమ్మా తల్లి ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిన సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ చాలారోజులకి ఎమ్మా చేతికందింది. ఆ గిప్ట్ ఎమ్మాను ఆశ్చర్యానికి గురిచేసింది. కళ్లనిండా ఆనంద భాష్పాలు నింపింది. తల్లి కూతురికి బహుమతి ఇవ్వడం మామూలే. కానీ, ఆ తల్లి చనిపోయిన తర్వాత డెలివరీ రావడంతో తల్లి లేదన్న విషయాన్ని మరిచిపోయింది. అసలు విషయం ఏంటంటే.. 2016లో ఎమ్మాకు వివాహం ముహూర్తం ఖరారైంది. ఇంతలోనే తన తల్లికి ప్రాణాంతక వ్యాధి సోకిందనే విషయం తెలిసింది. ఎమ్మా పెళ్లిని కళ్లారా చూడకుండానే తల్లి చనిపోయింది. ఇటీవల ఒక పార్సిల్ అందుకున్న ఎమ్మా షాక్‌కు గురైంది. అందులో నవవధువుకు వేసే అందమైన చెప్పులు దానిపై ఒక సందేశం కూడా చెక్కబడి ఉన్నది.

అదెక్కడ్నుంచో కాదు తన తల్లి దగ్గర్నుంచే వచ్చింది. పెండ్లిరోజు నీ పాదాలకు అందమైన పాదరక్షలు ఉండాలని భావించా. ఈ పాదరక్షలే నీకు నా ప్రత్యేక బహుమానం. నువ్వొక అద్భుతమైన రోజులను ఆస్వాదిస్తానని ఆశిస్తున్నా. అంతులేని ప్రేమతో మీ అమ్మ అనే సందేశం పాదరక్షలపై చెక్కించింది ఎమ్మా తల్లి. ఆమె బతికున్నప్పుడు తన కూతురి కోసం పాదరక్షలను తయారుచేసేందుకు లేస్ అండ్ లవ్ సంస్థలో ఆర్డర్ ఇచ్చింది. కానీ, వాటి తయారీ పూర్తయ్యే లోపు ఆమె ప్రాణాలు విడిచింది. ఆర్డర్ తీసుకున్న సంస్థ సదురు అడ్రస్‌కు డెలివరీ చేసింది. ఈ పాదరక్షలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన ఎమ్మా తల్లి పంపిన ఈ బహుమతి ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది. ఈ విషయాన్ని పాదరక్షల తయారీ సంస్థ లేస్ అండ్ లవ్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఒక తల్లి ప్రాణాలతో ఉన్నప్పుడు పంపిన సందేశం ఇప్పుడు బిడ్డకు చేరింది. అయితే దురదృష్టవశాత్తు ఆ తల్లి ఇప్పుడు ప్రాణాలతో లేదు. కానీ, ఆ గిఫ్ట్ ఎప్పటికీ ఆ బిడ్డకు ప్రత్యేకమైనదే అని పేర్కొంది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తున్నది.

739
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles