మహిళకు సముచిత స్థానం


Fri,March 22, 2019 12:31 AM

మహిళలు రాజకీయ అవకాశాలు, చట్టసభల్లో స్థానాలు కల్పించటంలో రువాండా దేశం ముందంజలో ఉన్నది. ఆ దేశపు పార్లమెంట్‌లో అత్యధిక సీట్లు మహిళలకు కేటాయించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Rwanda-women
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలంగా ఉన్నా వారికి సరైన గుర్తింపు ఉండదు. విద్యా, వైద్య రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ రాజకీయ అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. పురుషాధిక్యత వ్యవస్థలో మహిళలకు చట్టసభల్లో సరైన చోటు లేకుండా పోయింది. కానీ పొరుగు దేశాలు ఎన్నో మహిళలకు సముచిత స్థానాన్నిస్తాయి. అలాంటి దేశాల్లోనే ఆఫ్రికా ఖండంలోని రువాండా ఒకటి. కిందటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహిళ సాధికారతకు ఆ దేశం ప్రాధాన్యతను ఇచ్చింది. పార్లమెంట్‌లో 68శాతం సీట్లను మహిళలకు కేటాయించింది. మొత్తం 80 ఎంపీ సీట్లకు 54 స్థానాల్లో మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే నేపాల్ పార్లమెంట్‌లో మహిళలు 38శాతం ఉన్నారు. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో వారి ప్రాతినిథ్యం 20శాతం ఉంది. ఆఫ్రికా ఖండంలోని రువాండాలో మహిళలకు సముచిత స్థానం కల్చించడంలో మరో ముందడుగు వేసింది.

494
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles