జుట్టుకి రంగేస్తున్నారా?


Fri,March 22, 2019 12:30 AM

రంగుల జుట్టు కోసం తరచుగా రంగేస్తుంటే వెంటనే ఆపేయండి. లేదంటే అలర్జీలకు గురికావల్సి వస్తుంది. అలర్జీ అయితే సరి మరి రంగు తలనొప్పికి దారితీస్తే పరిస్తితేంటి? ఈ చిట్కాలు అలర్జీని తగ్గించడమే కాకుండా జుట్టును దృఢంగా ఉంచుతాయి.
hair-care
-నిమ్మరసం, నీటిని సమానంగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది తలలోని అలర్జీ, దురదను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
-బేకింగ్ సోడా నీటిలో బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కుదుళ్ల అలర్జీని నివారిస్తుంది.
-టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అలర్జీని నివారిస్తుంది. ప్రతిరోజూ టీ ట్రీ ఆయిల్ వాడడం వల్ల స్కిన్ రాషెస్, దద్దుర్లు, దురద వంటి లక్షణాలను నివారిస్తుంది.
-అలోవెరా గుజ్జుని తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల తలలో దురద, అలర్జీ రాకుండా చేస్తుంది.
-కొబ్బరినూనె జుట్టుని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడతుంది. అంతేకాకుండా జుట్టు పొడిబారకుండా, దురదను నివారించడంలో ఉపయోగపడుతుంది. తలస్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరినూనె తలకి పట్టించి తలస్నానం చేస్తే మంచిది.
-ఆపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఇన్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జుట్టుకి రంగు వేయడం వల్ల వచ్చే అలర్జీలను నివారిస్తుంది. ఇది జుట్టుని పొడిబారకుండా చేస్తుంది.
-నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. తర్వాత గాఢత తక్కువగల షాంపూతో తలస్నానం చేయడంతో అలర్జీ రాకుండా చేస్తుంది.

662
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles