హోలీ రంగులు వదిలించండిలా


Thu,March 21, 2019 02:37 AM

holi
-బకెట్ వేడినీటిలో సర్ఫ్ వేసి కలుపాలి. రంగులు అంటుకున్న బట్టలన్నింటినీ వేడినీటిలో నానబెట్టాలి. రెండు గంటలు నానిన తర్వాత డిటర్జెంట్‌తో ఉతుకాలి. తర్వాత బట్టలన్నింటినీ వేరువేరుగా ఆరవేయాలి.
-వెనిగర్, సర్ఫ్‌ని చల్లని నీటిలో వేసి బాగా కలుపాలి. ఈ నీటిలో రంగు దుస్తులను నానబెట్టాలి. వెనిగర్‌కి దెబ్బకి బట్టలకి అంటుకున్న రంగు వదులుతుంది. గంట తర్వాత మాములుగా ఉతికి ఆరేస్తే సరి.
-కిటికీలను శుభ్రం చేయడానికి వాడే స్ప్రేయర్ కూడా బట్టల రంగుల్ని తొలిగిస్తుంది. రంగులున్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. 20 నిమిషాలు అలానే ఉండనియ్యాలి. మెత్తటి బ్రష్ తీసుకొని రుద్దితే రంగు తొలిగిపోతుంది.
-నిమ్మకాయ బట్టలకి అంటుకున్న మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయరసం ఉన్న నీటిలో బట్టలను నానబెట్టి 15 నిమిషాల తర్వాత చేతులతో రుద్దాలి. తర్వాత డిజర్జెంట్‌తో కూడా ఉతికి ఆరేయాలి.
-మరకలు ఉన్న చోట టూత్‌పేస్ట్ రాసి రాత్రంతా అలానే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం డిటర్జెంట్ సాయంతో మరకలను రుద్దితే తొలిగిపోతాయి.

690
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles