ఆవలింత.. అందుకేనా?


Tue,March 19, 2019 12:57 AM

yawn
ఆవలింత వస్తే అది రక్తంలోని ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకేనని అనుకొనేవారు. కానీ, ఆక్సిజన్ సరఫరాని పెంచేంత ప్రభావం ఆవలింతకు లేదని పరిశోధనలో వెల్లడైంది. మరి ఆవలింతలు ఎందుకు వస్తాయి?


ఆవలించడం అనేది తల్లి గర్భంలోంచి మొదలవుతుంది. చనిపోయేంత వరకు ఆవలింతలు వస్తూనే ఉంటాయి. దీనికి వయసుతో పనిలేదు. మనుషులే కాదు జంతువులకూ ఆవలింతలు వస్తాయి. జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తారట. ఇంతకీ ఆవలితంలు ఎందుకు వస్తాయనే ప్రశ్నకు రెండు సమాధానాలున్నాయి. మొదటిది.. ప్రాణం ఉన్న ప్రతీ జీవి అలసిపోయినా, విసుగు చెందినా మెదడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో బుర్రకి కాస్త చల్లగాలి కావాలి. ఆవలింత రూపంలో చల్లటి గాలిని పీల్చుకుంటారు. ఆవలింత మెదడుని చల్లబరచడానికి, ఉత్తేజపరచడానికి దోహదపడుతుంది. అప్పడు మనిషిలో అప్రమత్తత పెరుగుతుంది. రెండోది సమూహ స్వభావం. ఆవలింత ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. ఇదోరకం కమ్యూనికేషన్ అని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఒకరి నుంచి ఇంకొకరికి పాకినప్పుడు ప్రతీ ఒక్కరూ ఒకే స్థాయి అప్రమత్తతకు చేరుకుంటారు. ఒకరిని చూసి మరొకరు ఆవలించడమనేది సహ అనుభూతికి సంబంధించినదని కొందరు మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యజమాని ఆవలించినప్పుడు పెంపుడు జంతువులు కూడా ఆవలిస్తాయట.

703
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles