చెవిపోటు తగ్గుతుందిలా!


Thu,March 14, 2019 11:58 PM

ear-pain
-రోజుకు రెండుసార్లు చెవిలో కొబ్బరి నూనె వేయాలి. వేసిన కాసేపటికి చెవి పోటు తగ్గుతుంది. అందులోని లారిక్ ఆమ్లానికి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉండడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
-చెవిలో కొబ్బరి నూనె వేసిన తర్వాత కాసేపు కదలకుండా ఉండాలి.
-ఉప్పును శుభ్రమైన సాక్సులో వేసి మూట కట్టాలి. ఆ తర్వాత పెనం మీద వేడి చేసి పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వేడి మూటని చెవి వెనుక భాగాన పెట్టి కాపాలి. దీంతో ఉపశమనం లభించడంతో పాటు నొప్పి పూర్తిగా తగ్గుతుంది.
-వెల్లుల్లిపాయల నుంచి కొద్దిగా రసం పిండాలి. వచ్చిన రాసాన్ని వేడి చేయాలి. చల్లారిన తర్వాత రెండు చుక్కల నూనెని చెవిలో వేయాలి. చెవిని అలాగే పది నిమిషాల పాటు ఉంచాలి. ఆలివ్‌నూనెలో వెల్లుల్లి రసం పిండి చెవిలో వేసుకున్నా మంచిదే.
-ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే అందులోని యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీనివల్ల చెవిలో ఏమైనా వ్యాక్స్ ఉన్నా కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles