నీతా అంబానీ పెండ్లి లెహంగా!


Thu,March 14, 2019 11:57 PM

ఈ నెల మార్చి 9న రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ కొడుకు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెండ్లిలో నీతా అంబానీ ధరించిన చీర ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందరూ మాట్లాడుకునేంత ఆ చీరలో ఏం దాగుందో తెలుసా?
nita-ambani
సమంత విహాహ వేడుకలో ధరించిన చీర గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. చీర మొత్తం నాగచైతన్య, సమంతల పరిచయం నుంచి పెండ్లి వరకు జరిగిన సంఘటనలతో చీర డిజైన్ చేయించింది. తర్వాత అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా పెండ్లి చీర బాగా వైరల్ అయింది. ప్రస్తుతం నీతా అంబానీ లెహంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. జియో వరల్డ్ సెంటర్ భద్రా కుర్ల కాంప్లెక్స్‌లో మార్చి 9న జరిగిన ఆకాశ్ అంబానీ, శ్లోకా వివాహ వేడుకలో నీతా అంబానీ ధరించిన లెహంగా గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. వేడుకలో ఎర్రని లెహంగాతో మిళమిళా మెరిసిపోయింది. ఏంటా లెహంగా ప్రత్యేకతా అంటే.. నీతా అంబానీ బ్లౌజ్ వెనుకభాగంలో శుభారంబ్‌తో పాటు కొడుకు ఆకాశ్, కోడలు శ్లోకా పేర్లతో బ్లౌజ్‌ని డిజైన్ చేయించింది. ముఖేశ్ అంబానీ కూడా నీతా లెహంగాకి మ్యాచ్ అయ్యేలా ఎర్రటి కుర్తా ధరించాడు. వీరితో పాటు ఇషా అంబానీ కూడా ప్రత్యేకంగా తయారైంది. నీతా 35 యేండ్ల పెండ్లి చీరని ఇషా ధరించి అందంగా ముస్తాబయింది. మా పెండ్లి రోజుని గుర్తుచేస్తున్నావంటూ కూతుర్ని ముద్దాడింది నీతా అంబానీ.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles