ఎందుకంటే?


Fri,February 22, 2019 01:17 AM

మూడోకన్నుకు ప్రతీక బొట్టు
Endukante
కనుబొమల మధ్య, నుదుట బొట్టు (తిలకం) పెట్టుకోవడం ఎందుకో తెలిస్తే ఈ సంస్కారం పట్ల మనకు మరింత గౌరవం పెరుగుతుంది. ఆడవారైనా, మగవారైనా బొట్టు పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. కానీ, ఇప్పుడు అందరూ బొట్టు పెట్టుకోవడం లేదు. కారణం, కేవలం ఆడవారే దానిని ధరిస్తారన్న అపోహ నెలకొనడమే. ఆడవారికైనా, మగవారికైనా కనుబొమల నడుమ, శిరస్సుకు సరిగ్గా వెనుక వైపు ఆజ్ఞాచక్రం ఉంటుంది. మనిషి వెన్నెముక పొడవునా వుండే ఏడు కుండలినీ శక్తి కేంద్రీయ చక్రాలలో ఇది రెండవది. శిరస్సుమీది మొదటి చక్రం సహస్రారం కింద ఇది నెలకొని ఉంటుంది. పొడవైన మధ్యవేలుతో కాస్త ఒత్తి పట్టడం ద్వారా ఈ కుండళినీ శక్తిని చైతన్యపరచవచ్చునని ప్రాచీనశాస్ర్తాలు చెబుతున్నాయి. దీనిని మూడోకన్ను చక్రంగానూ చెప్తారు. గురువు చూపుడువేలుతో కనుబొమల మధ్య నొక్కిపట్టి, శక్తిని ప్రేరేపిస్తాడు కనుక గురుచక్రమనీ పేరుంది. శుభానికి చిహ్నంగానూ తిలకధారణను భావిస్తారు. దేవతా పూజలు, శుభకార్యాల ఆహ్వానాలకు ఇదొక సూచన కూడా. కుడిచేతి మధ్యవేలుతో బొట్టు పెట్టుకోవడమే శాస్ర్తోక్తం, సౌకర్యమని వేద పండితులు అంటారు. ఎదుటి వ్యక్తికి బొట్టు పెట్టేటప్పుడు మాత్రం మన బొటన వేలును ఉపయోగించాలి.

619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles