మేల్కొలుపు


Fri,February 22, 2019 01:15 AM

త్వత్పాద ధూళిభరిత స్ఫురితోత్తమాంగా:
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా:
కల్పాగమా కలనయా కులతాం లభ్యంతే
శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతమ్ ॥ 19 ॥
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

Melukolupu
ఎంతో పవిత్రమైన నీ పాదధూళిని తమ శిరస్సులపై ధరించడం ద్వారా, తమ మనోఫలకాలపై స్వర్గసుఖాల మమకారాన్ని చూపకుండా నిజమైన భక్తులంతా నీ సేవ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ యుగప్రళయమే కనుక సంభవిస్తే నిన్ను సేవించుకొనే భాగ్యం కరువైపోతుంది కదా అన్న బెంగతో వారంతా అత్యంత భయభక్తులతో ఇప్పుడే నిన్ను సేవించడానికి సిద్ధమై ఉన్నారు. ఓ వేంకటా చలపతీ! అందుకొనుమా మా సుప్రభాతమ్.

390
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles