ప్లాస్టిక్‌పై పోరాటం..


Wed,February 20, 2019 03:21 AM

హాయిగా ఇంట్లో కూర్చుని సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని మార్చాలనుకునే వారు ఒకరు. సమాజాన్ని పరిశీలిస్తూ తమ పనులతో ఆదర్శంగా నిలిచేవారు మరొకరు. 31 ఏండ్ల అభిమన్యు చక్రవర్తి రెండో రకం వ్యక్తి. ఇంతకీ అతనేం చేశాడంటే..
PLASTIC-FIGHT
పొగతాగటం కొందరికి అలవాటు. ఇంకొందరికి తీవ్ర వ్యసనం. నేటి యూత్‌కి ఇది ఫ్యాషన్. ఏది ఏమైనా అతిగా పొగతాగితే వచ్చే అనర్థాల గురించి మనకు తెలిసిందే. తాజాగా ఆ అనర్థాల లిస్ట్‌లోకి మరొకటి వచ్చి చేరింది.. గతేడాది బైక్‌పై మయన్మార్, థాయ్‌లాండ్, లాస్, కాంబోడియా, నేపాల్ దేశాలను పర్యటించాడు. అంతే కాదండోయ్.. ఆయా దేశాల్లో అతడు వెళ్తున్న దారిలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్‌ను సేకరించాడు. పునర్వినియోగం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలా చేయడానికి ఓ కారణం, నేపథ్యం ఉన్నది. స్పెయిన్‌లోని బీచ్‌లో చనిపోయిన ఓ తిమింగళం కడుపులో 29 కిలోల ప్లాస్టిక్ ఉండడాన్ని చూశాడు అభిమన్యు. అప్పటి నుంచి మరే జీవి ప్లాస్టిక్ వల్ల చనిపోకూడదని సంకల్పించుకున్నాడు. సెప్టెంబర్ 12, 2018న ప్రారంభమైన అతడి ప్రయాణం ప్లాస్టిక్ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించే దిశగా సాగింది. ప్లాస్టిక్‌ను తమ నుంచి దూరంగా పడేశాం అని అందరూ అనుకుంటారు. కానీ ప్లాస్టిక్ ఎక్కడికీ పోదు. ఎక్కడా ఇమడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అంటూ ప్రచారం చేస్తున్నాడు అభిమన్యు చక్రవర్తి.


PLASTIC-FIGHT2
అతడు చేస్తున్న ప్లాస్టిక్‌ను సేకరించి, పునరుత్పత్తి ప్రయత్నాన్ని దక్షిణ ఆసియా దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ యాత్రతో ప్లాస్టిక్ రహిత విజ్ఞానాన్ని కూడా నేర్చుకున్నానని అభిమన్యు చెబుతున్నాడు. తమ వంతుగా ప్లాస్టిక్ వ్యర్థ రహితం కోసం ప్రచారం, ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యమని కోరుతున్నాడు. మరో మూడు నెలల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ నివారించేందుకు ప్లెడ్జ్ టూ ప్లాగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పాడు.

518
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles