చూపు తగ్గుతున్నది..


Wed,February 20, 2019 03:20 AM

పొగతాగటం కొందరికి అలవాటు. ఇంకొందరికి తీవ్ర వ్యసనం. నేటి యూత్‌కి ఇది ఫ్యాషన్. ఏది ఏమైనా అతిగా పొగతాగితే వచ్చే అనర్థాల గురించి మనకు తెలిసిందే. తాజాగా ఆ అనర్థాల లిస్ట్‌లోకి మరొకటి వచ్చి చేరింది..
smoke
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్‌కు కారకమని రోజుకు వందల సార్లు చదువుతుంటాం, చూస్తుంటాం. కానీ మానేయం. ఎంత మానాలని ప్రయత్నించినా మానకుండా ఉండలేం. రోజుకూ 20 సిగరెట్లు తాగటం వల్ల దాని ప్రభావం కండ్ల మీద కూడా ఉంటుందని అమెరికాకు చెందిన రట్గెర్స్ రీసెర్చ్ సంస్థల పరిశోధనలో తేలింది. ప్రస్తుతం అక్కడ మూడున్నర కోట్ల మంది పొగతాగుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. వారిలో దాదాపు అందరికీ పొగతో వచ్చే వ్యాధులు ఉన్నాయని, అందులో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తేలింది. రోజుకు 15 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్న 71 మందిపై ఈ పరిశోధన జరిపారు. వయస్సు 25 నుంచి 45 ఉన్న వ్యక్తులను సర్వేలో భాగంగా ఎంచుకున్నారు.


వీరిలో 36 మంది రోజూ 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారు. ధూమపాన సంబంధిత వ్యాధులతో పాటు కంటిచూపు కూడా మందగిస్తుందని తేల్చారు. పరిశోధనలో పాల్గొన్న వారి కండ్లు కొన్ని రంగులను గుర్తించటం లేదనీ, ప్రధాన రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను ఇతర రంగులుగా చెపుతున్నారని అధ్యయనకారులు పేర్కొన్నారు. సిగరెట్లలో ఉండే న్యూరోటాక్సిక్ కెమికల్స్ కండ్లపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయని, వాటి తీవ్రత పెరిగే కొద్దీ కండ్లు కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

640
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles