చెప్తే వినిపిస్తలేదు!


Wed,February 20, 2019 03:18 AM

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా యువతీయువకులకు వినిపించడం లేదు. కారణం వినికిడి లోపం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనం చెబుతున్న నిజాలివి.
HERE
చెవులకు ఇయర్‌ఫోన్స్ ధరించి ఫుల్ సౌండ్ పెట్టుకొని పాటలు వినడం నేటి యువతకు అలవాటుగా మారింది. కానీ అది తీవ్ర నష్టం చేస్తుందని ఎంత చెప్పినా వినడం లేదు. రోజురోజుకు వినికిడి సమస్య ఉన్న యువత సంఖ్య రెట్టింపు అవుతున్న విషయాన్ని వెల్లడించింది. 12 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. 85 డెసిబుల్స్ శబ్దాన్ని ఎనిమిది గంటలు, 100 డెసిబుల్స్ శబ్దాన్ని 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు వింటే కర్ణభేరి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. వాహనాలు, హెయిర్‌డ్రయర్, బార్ అండ్ డిస్కో, ఫైర్‌క్రాకర్, ఎంపీ 3 మ్యూజిక్ ఎక్కువ ఈ సమస్యకు కారణం అవుతున్నాయి. ఇది ఇలాగే ఉంటే భవిష్యత్తులో బధిర ప్రపంచం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇయర్‌ఫోన్స్ వాడకాన్ని తగ్గించి జ్ఞానేంద్రియాలను కాపాడుకోవాలని, అవయవాలను పరిరక్షించుకోవాలని వారు కోరుతున్నారు.

593
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles