రొట్టెనా? అన్నమా?


Wed,February 20, 2019 01:17 AM

అన్నం.. చపాతీ ఈ రెండింటిలో ఏది మంచిది? అన్న విషయంపై చాలామందికి అనుమానాలు రావడం సర్వసాధారణం. డైటీషియన్లు చెబుతున్న దాని ప్రకారం ఏది ఉత్తమం?
rice
గోధుమ పిండితో నూనె లేకుండా చేసుకునే రోటీలు, బియ్యం మధ్య తేడా చూస్తే... వైట్ రైస్ కంటే గోధుమ పిండిలో ప్రొటీన్ నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే, మూడు రెట్లు ఎక్కువగా కార్బొహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. పైగా రైస్ కంటే గోధుమల్లో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే రోటీలో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహులకు ఇదే ఇబ్బందికరమైన అంశం. అదే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్, మైక్రో న్యూట్రియెంట్లు ఎక్కువ. తక్కువ తిన్నా కడుపునిండిన భావన ఉండాలని కోరుకునే వారికి బ్రౌన్ రైస్ తగినవి. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారికి ముమ్మాటికీ రోటీలే నయం. అలాగే బరువు పెరగకుండా ఉండాలన్నా రోటీలే తగినవి. రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రోజుకు రెండుసార్లే భోజనం తీసుకోవడం... భోజనంలో ఒక రోటీని భాగం చేసుకోవడం, ప్రొటీన్స్ తో పాటు కాయగూరలు, ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.

248
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles