ఈ షూస్ స్మార్ట్ గురూ!


Wed,February 20, 2019 01:12 AM

షూస్ వేసుకునే ముందు శుభ్రంగా తుడుచుకోవాలి. కూర్చొని కాళ్లకు సరిగ్గా సెట్ అయ్యేలా తొడుక్కోవాలి. పదే పదే ఊడిపోకుండా లేసులు గట్టిగా కట్టుకోవాలి. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు స్మార్ట్‌షూస్ వచ్చేశాయి. నైకీ పరిచయం చేసిన ఆ స్మార్ట్‌షూస్
వివరాలు ఇవిగో..

smart-shoes
ఫిట్‌నెస్, ఫ్యాషన్ యాక్సెసరీస్‌ను రూపొందించే నైకీ కంపెనీ సరికొత్త స్పోర్ట్స్ షూస్‌ను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్లో ఆర్డర్ వేస్తే చాలు.. తనకు తానే ముడి వేసుకునే షూస్ తయారుచేసింది. నైకీ అడాప్ట్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌షూస్ మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. బ్యాక్ టు ద ఫ్యూచర్ పార్ట్ 2 సినిమాలో కనిపించిన ఫ్యూచర్ గాడ్జెట్స్‌లో స్మార్ట్ షూస్ ఒకటి. ఇప్పుడు నైకీ ఆ కలను నిజం చేసింది. ఈ షూస్ ధరించేవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా పాదానికి సరిగ్గా సరిపోయేలా షూ సైజు మార్చుకోవచ్చు. టైటుగా, వదులుగా మనకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చన్నమాట. షూలో కాలు పెట్టగానే యాప్‌లో ఉండే మోటార్, గేర్ బూటు ఎంత టైటు ఉండాలో గుర్తించి, లేస్ టైట్ చేస్తుంది. గతంలో కూడా నైకీ క్రీడాకారుల పరుగును రికార్డ్ చేసే స్మార్ట్‌షూస్ తయారుచేసింది. కానీ అవి అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ స్వయంగా లేస్ కట్టుకునే షూస్‌ను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని ధర మార్కెట్లో రూ. 25వేలు ఉంది. రానున్న రోజుల్లో నిత్య జీవితంలో మనం వాడే ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోనుందనడానికి ప్రస్తుతం మనం చూస్తున్న టెక్నాలజీ అప్‌డేట్లు సంకేతాలుగా భావించవచ్చు.

310
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles