ఆధునిక పోకడ గురక ధ్వనులకు గుడ్‌బై


Tue,February 19, 2019 01:38 AM

గురక పెట్టేవారి ధ్వనులు పక్కన పడుకొనే వారికి వినపడకుండా చేసే కొత్త తరహా తెలివైన దిండును శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి పరిచారు. ఇది తన చుట్టూ వినిపించే గురక ధ్వనులను పసిగట్టేసి తనలోకి లాగేసుకొంటుందని వారు అంటున్నారు.
Aadhunika-Pokada
గురక పెట్టేవారి పక్కన పడుకొంటే చిత్ర విచిత్రమైన ఆ ధ్వనులకు ఎవరికీ నిద్రపట్టదు. గురక పెట్టేవారికి, వినేవారికీ ఇద్దరికీ అదొక పెద్ద సమస్యే. గురక పెట్టేవారికి దానిని మాన్పడమెలా అన్నది ప్రస్తుతానికి వేరే విషయం. వారి పక్కన పడుకొనే వారికి ఆ ధ్వనులు వినకుండా వుంటే బావుంటుందనుకొనే వారి కోసమే ఈ వార్త. ఇలాంటి వారి కోర్కె తీర్చే దిశలోనే పరిశోధకులు ఇప్పుడు స్నోర్ సైలెన్సింగ్ పిల్లోను అభివృద్ధి పరిచారు. నార్తర్న్ ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల దీనిని సృష్టించారు. ఈ గురక ధ్వనులనే కాక పరిసరాలలోని ఇతర ధ్వనులనూ ఈ దిండు నియంత్రిస్తుంది. అయితే, ఏ ఇద్దరు గురక పెట్టేవాళ్ల ధ్వనులూ ఒక్కలా వుండవని, అవి వారిలో నాటకీయంగా మారుతుంటాయని పరిశోధకులు అంటున్నారు. అలాంటివే కాకుండా ప్రత్యేకించి దీర్ఘధ్వనిని, స్వల్పకాలిక ధ్వనినీ వేర్వేరుగా కూడా ఈ దిండు పట్టేసి, ఎదుటి వారికి వినిపించకుండా చేస్తుందని వారన్నారు. సుమారు 31 డెసిబెల్స్ వరకూ గురక ధ్వనుల తీవ్రతలను ఇది తగ్గిస్తుంది. ఇలాంటి తెలివైన దిండు కోసం ఎదురు చూసే వారు ఎందరో ఉన్నారన్నది నిజం.

648
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles