బీపీ పెంచుకోకండి


Tue,February 19, 2019 01:34 AM

BP-check
బీపీ సమస్య ఇప్పుడు కామన్ అయిపోయింది. అనవసరంగా బీపీ పెంచుకోకు వంటి మాటలు కూడా సర్వ సాధారణం అయిపోయాయి. కానీ చాలా మంది ఆ బీపీని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవడం లేదట.


బీపీ నియంత్రణ గురించి నేషనల్ హెల్త్ సర్వీస్ కొన్ని నియమాలను సూచించింది. హైపర్ టెన్షన్‌ను నియంత్రించుకుంటే మిగతా ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని చెప్పింది. బీపీ అనేది మన నియంత్రణలో ఉంటుంది. బీపీ వంశపారంపర్యంగానూ వస్తుంది. ఇది జీవనశైలి కారణంగా వస్తుంది. బీపీ గురించి విపరీతంగా ఆలోచించి మరింత బీపీ పెంచుకోవద్దని.. ఇది టీనేజ్ పిల్లల్లోనూ వస్తుందని అన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. మామూలుగా మూడేండ్లు నిండిన పిల్లల్లోనూ రక్తపోటులో మార్పులు ఉంటాయట. అయితే వయసు పెరుగుదలతో రక్త పీడనంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉంటే వారసత్వంగా మిగతావారికి రావచ్చు. బీపీ ఉన్నవారు ఆల్కహాల్.. పొగతాగటం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా టెన్షన్ పడకుండా పాజిటివ్‌నెస్‌తో ఉండటం వల్ల రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచుకోవచ్చు. బీపీ ప్రభావం మనసుపై పడుకుండా ఉండేందుకు యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటి వ్యాయామాలు పాటించాలని సూచించారు.

161
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles