గొంతు నొప్పిని పోగొట్టుకోండిలా..


Mon,February 18, 2019 01:08 AM

సీజన్ మారడం సహజం. సీజన్‌తో పాటు జలుబు, దగ్గు రావడం కూడా సహజమే. కానీ ఆ సమయంలో నొప్పి మాత్రం సహజం కాదు. ఏమీ తినాలనిపించదు. ఏమీ పాలుపోదు. ఈ చిన్న చిట్కాలు పాటించి గొంతు నొప్పి పోగొట్టుకోండి..
throat
-గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. అంతే కాకుండా గోరువెచ్చని నీటిలో ఆపిల్ పండ్ల రసం వెనిగర్, తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు, మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
-గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుకిలించి ఉమ్మేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది. దీంతో చాలా ఫ్రీగా మాట్లాడొచ్చు.
-పాలల్లో మిరియాల పొడి కలుపాలి. రోజూ నిద్రించే ముందు ఇవి తాగి పడుకుంటే కొంత మేరకు ఉపశమనం దొరుకుతుంది.
-గొంతులో మంటగా ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బను తింటే తగ్గుతుంది. గొంతులో గరగర వంటి సమస్యలు పోవాలంటే ఉల్లిరసం తాగితే బాగుంటుంది.
-అల్లం టీ తాగడం వల్ల కూడా గొంతు గరగర సమస్య నుంచి బయటపడొచ్చు. అదేవిధంగా అల్లాన్ని నీటిలో ఉడికించి ఆ నీటిని గాని సేవిస్తే గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

946
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles