‘వాలెంటైన్స్ డే’పై నమ్మకమే లేదు!


Sun,February 17, 2019 01:37 AM

Valentines-Day
ప్రేమికుల దినోత్సవం నిర్వహించుకోవడంలో అర్థం లేదట! ఈ మాటలంటున్నది ఎవరో కాదండోయ్ సాక్షాత్తూ ప్రేమికులే అంటున్నారు. ఇలా అంటున్నది ఒకరిద్దరో కాదు.. 86 శాతం మంది ప్రేమికులు ఇదే మాట చెబుతున్నారు.
ప్రేమగా చూసుకునే వ్యక్తి పక్కన ఉండాలి గానీ ప్రతిరోజు ప్రేమికుల రోజే అంటున్నారు ప్రేమికులు, భార్యాభర్తలు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రోజును ఏర్పాటు చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం అర్థంలేని పని అంటూ బదులిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గురువారం వాలెంటైన్స్ డే జరుపుకున్నారు. అయితే వాలెంటైన్స్ డే అంశంపై అదేరోజు టైమ్స్ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఇలాంటి వాటిపై తమకు నమ్మకం లేదని నెటిజన్లు అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ పోల్‌లో 1500 మంది తమ ఒపీనియన్ వెల్లడించారు. అందులో 86 శాతం మంది ప్రేమికుల రోజుపై తమకు నమ్మకం లేదన్నారు. తమకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి వెంట ఉంటే ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవమే అని చెప్పారు. అయితే, కొన్నేళ్లుగా ప్రేమికుల దినోత్సవం రోజు అంత సందడి కనిపించడం లేదట. తమ భాగస్వామిపై ప్రతిరోజు ప్రేమను చూపిస్తే, ప్రేమగా మాట్లాడితే ఆ జంటకు అదే పెద్ద వాలెంటైన్స్ డే అని కొందరు తెలిపారు.

260
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles