నా కుమారునికి తోడు కావాలి.


Sat,February 16, 2019 01:33 AM

ఓ తల్లి తన కుమారుడికి తోడు కోసం క్యాంపస్‌లోని అమ్మాయిలందరినీ వేడుకుంది. ఇష్టమైతే కలిసి బయటకు వెళ్లాలని కోరింది. సరిగ్గా వాలెంటైన్స్‌డే రోజునే జరగటంతో ఇది కాస్త వైరల్ అవుతున్నది.
mother
వాలెంటైన్స్ రోజుకు రెండు రోజుల ముందు 50 ఏండ్ల ముసలావిడ తన కుమారునికి తోడు కోసం క్యాంపస్‌లో అమ్మాయిల కోసం వెతికింది. అచ్చం ఇది రవితేజ సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన తీరు లెక్కనే అనిపిస్తుంది కదా? అవును అలాంటిదే యూకేలోని టౌసన్ యూనివర్సిటీలో జరిగింది. తన కొడుకు ఫొటోను చూపిస్తూ మీకు నచ్చితే డేటింగ్‌కు వెళ్లాలనీ అడిగింది. ఇలా క్యాంపస్‌లోని రెండు భవనాల్లో ఉండే అమ్మాయిలను అడగటంతో ఈ విషయం కాస్త యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు చేరింది. చాలా మంది అమ్మాయిలు ఈ విషయాన్ని ఇబ్బందికరంగా భావించి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా వీడియోలను రిలీజ్ చేశారు. పోలీసుల జోక్యంతో విషయం కాస్త సీరియస్ అయింది. ఫుటేజ్‌లో ఉన్న ముసలావిడను చూసి విచారణ ఏమీ అవసరం లేదని యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులను కోరింది. దీంతో ఆందోళన ఏమీ లేదని పోలీసులు వెనుదిరిగాను. ఆ ముసలావిడ ఉద్దేశ్యం అమాయకత్వంగా ఉన్నప్పటికీ , ఇబ్బందికర అంశంగా అక్కడి విద్యార్థినులు భావిస్తున్నారు.

338
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles